PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.5.1
TELOV-BSI యేసు

ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;౹
 
Ādāmu vanśāvaḷi granthamu idē. Dēvuḍu ādāmunu sr̥jin̄cina dinamuna dēvuni pōlikegā atani cēsenu;౹

ఆదికాండము 5
ఆదికాండము 5:1-17

The Descendants of Adam

1 ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను;౹
 
Ādāmu vanśāvaḷi granthamu idē. Dēvuḍu ādāmunu sr̥jin̄cina dinamuna dēvuni pōlikegā atani cēsenu;౹
2 మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.౹
 
Magavānigānu āḍudānigānu vārini sr̥jin̄ci vāru sr̥jin̄cabaḍina dinamuna vārini āśīrvadin̄ci vāriki narulani pēru peṭṭenu.౹
3 ఆదాము నూట ముప్పది యేండ్లు బ్రదికి తన పోలికెగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను.౹
 
Ādāmu nūṭa muppadi yēṇḍlu bradiki tana pōlikegā tana svarūpamuna kumāruni kani ataniki ṣētu anu pēru peṭṭenu.౹
4 షేతును కనిన తరువాత ఆదాము బ్రదికిన దినములు ఎనిమిదివందల ఏండ్లు; అతడు కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Ṣētunu kanina taruvāta ādāmu bradikina dinamulu enimidivandala ēṇḍlu; ataḍu kumārulanu kumārtelanu kanenu.౹
5 ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
 
Ādāmu bradikina dinamulanniyu tom'midivandala muppadi yēṇḍlu; appuḍataḍu mr̥tibondenu.
6 షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను.౹
 
Ṣētu nūṭa ayidēṇḍlu bradiki enōṣunu kanenu.౹
7 ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిదివందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Enōṣunu kanina taruvāta ṣētu enimidivandala ēḍēṇḍlu bradiki kumārulanu kumārtelanu kanenu.౹
8 షేతు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల పండ్రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
 
Ṣētu bradikina dinamulanniyu tom'midivandala paṇḍreṇḍēṇḍlu; appuḍataḍu mr̥tibondenu.
9 ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.౹
 
Enōṣu tombadi sanvatsaramulu bradiki, kēyinānunu kanenu.౹
10 కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Kēyinānunu kanina taruvāta enōṣu enimidi vandala padunaidēṇḍlu bradiki kumārulanu kumārtelanu kanenu.౹
11 ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయి దేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
 
Enōṣu dinamulanniyu tom'midivandala ayi dēṇḍlu; appuḍataḍu mr̥tibondenu.
12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.౹
 
Kēyinānu ḍebbadi yēṇḍlu bradiki mahalalēlunu kanenu.౹
13 మహలలేలును కనినతరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Mahalalēlunu kaninataruvāta kēyinānu enimidi vandala naluvadi yēṇḍlu bradiki kumārulanu kumārtelanu kanenu.౹
14 కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
 
Kēyinānu dinamulanniyu tom'midivandala padi yēṇḍlu; appuḍataḍu mr̥tibondenu.
15 మహలలేలు అరువదియైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.౹
 
Mahalalēlu aruvadiyaidēṇḍlu bradiki yeredunu kanenu.౹
16 యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పదియేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Yeredunu kanina taruvāta mahalalēlu enimidi vandala muppadiyēṇḍlu bradiki kumārulanu kumārtelanu kanenu.౹
17 మహలలేలు దినములన్నియు ఎనిమిదివందల తొంబదియైదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
 
Mahalalēlu dinamulanniyu enimidivandala tombadiyaidēṇḍlu; appuḍataḍu mr̥tibondenu.

God Takes Up Enoch

18 యెరెదు నూట అరువది రెండేండ్లు బ్రదికి హనోకును కనెను.౹
 
Yeredu nūṭa aruvadi reṇḍēṇḍlu bradiki hanōkunu kanenu.౹
19 హనోకును కనిన తరువాత యెరెదు ఎనిమిది వందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Hanōkunu kanina taruvāta yeredu enimidi vandalayēṇḍlu bradiki kumārulanu kumārtelanu kanenu.౹
20 యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
 
Yeredu dinamulanniyu tom'midivandala aruvadireṇḍēṇḍlu; appuḍataḍu mr̥tibondenu.
21 హనోకు అరువదియైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.౹
 
Hanōku aruvadiyaidēṇḍlu bradiki metūṣelanu kanenu.౹
22 హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Hanōku metūṣelanu kanina taruvāta mūḍu vandalayēṇḍlu dēvunitō naḍucucu kumārulanu kumārtelanu kanenu.౹
23 హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.౹
 
Hanōku dinamulanniyu mūḍuvandala aruvadiyaidēṇḍlu.౹
24 హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
 
Hanōku dēvunitō naḍicina taruvāta dēvuḍatani tīsikonipōyenu ganuka ataḍu lēkapōyenu.

From Methuselah to Noah

25 మెతూషెల నూట ఎనుబదియేడేండ్లు బ్రదికి లెమెకును కనెను.౹
 
Metūṣela nūṭa enubadiyēḍēṇḍlu bradiki lemekunu kanenu.౹
26 మెతూషెల లెమెకును కనిన తరువాత ఏడు వందల ఎనుబది రెండేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Metūṣela lemekunu kanina taruvāta ēḍu vandala enubadi reṇḍēṇḍlu bradiki kumārulanu kumārtelanu kanenu.౹
27 మెతూషెల దినములన్నియు తొమ్మిదివందల అరువది తొమ్మిదియేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
 
Metūṣela dinamulanniyu tom'midivandala aruvadi tom'midiyēṇḍlu; appuḍataḍu mr̥tibondenu.
28 లెమెకు నూట ఎనుబది రెండేండ్లు బ్రదికి ఒక కుమారుని కని
 
Lemeku nūṭa enubadi reṇḍēṇḍlu bradiki oka kumāruni kani
29 –భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను.౹
 
–Bhūmini yehōvā śapin̄cinanduvalana kaligina mana cētula kaṣṭamu viṣayamulōnu mana pani viṣayamulōnu itaḍu manaku nem'madi kalugajēyunanukoni ataniki nōvahu ani pēru peṭṭenu.౹
30 లెమెకు నోవహును కనిన తరువాత ఏనూట తొంబదియైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.౹
 
Lemeku nōvahunu kanina taruvāta ēnūṭa tombadiyaidēṇḍlu bradiki kumārulanu kumārtelanu kanenu.౹
31 లెమెకు దినములన్నియు ఏడువందల డెబ్బది యేడేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
 
Lemeku dinamulanniyu ēḍuvandala ḍebbadi yēḍēṇḍlu; appuḍataḍu mr̥tibondenu.
32 నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
 
Nōvahu aiduvandala yēṇḍlu galavāḍai ṣēmunu hāmunu yāpetunu kanenu.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.