PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.3.1

దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో–ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.౹
 
Dēvuḍaina yehōvā cēsina samasta bhūjantuvulalō sarpamu yuktigaladai yuṇḍenu. Adi ā strītō–idi nijamā? Ī tōṭa ceṭlalō dēni phalamulanainanu mīru tinakūḍadani dēvuḍu ceppenā? Ani aḍigenu.౹

ఆదికాండము 3
ఆదికాండము 3:1-7

The Serpent’s Deception

1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో–ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను.౹
 
Dēvuḍaina yehōvā cēsina samasta bhūjantuvulalō sarpamu yuktigaladai yuṇḍenu. Adi ā strītō–idi nijamā? Ī tōṭa ceṭlalō dēni phalamulanainanu mīru tinakūḍadani dēvuḍu ceppenā? Ani aḍigenu.౹
2 అందుకు స్త్రీ–ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును;౹
 
Anduku strī–ī tōṭa ceṭla phalamulanu mēmu tinavaccunu;౹
3 అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములనుగూర్చి దేవుడు–మీరు చావకుండునట్లు వాటిని తిన కూడదనియు, వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను.౹
 
Ayitē tōṭa madhyanunna ceṭṭu phalamulanugūrci dēvuḍu–mīru cāvakuṇḍunaṭlu vāṭini tina kūḍadaniyu, vāṭini muṭṭakūḍadaniyu ceppenani sarpamutō anenu.౹
4 అందుకు సర్పము–మీరు చావనే చావరు;౹
 
Anduku sarpamu–mīru cāvanē cāvaru;౹
5 ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతలవలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పగా
 
Ēlayanagā mīru vāṭini tinu dinamuna mī kannulu teravabaḍunaniyu, mīru man̄ci ceḍḍalanu erigina vārai dēvatalavale unduraniyu dēvuniki teliyunani strītō ceppagā
6 స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమై నదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొనితిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడ తినెను;౹
 
Strī ā vr̥kṣamu āhāramunaku man̄cidiyu, kannulaku andamainadiyu, vivēkamiccu ramyamai nadiyunai yuṇḍuṭa cūcinappuḍu āme dāni phalamulalō konni tīsikonitini tanatōpāṭu tana bhartakunu iccenu, ataḍu kūḍa tinenu;౹
7 అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను; వారు తాము దిగంబరులమని తెలిసికొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసికొనిరి.౹
 
Appuḍu vāriddari kannulu teravabaḍenu; vāru tāmu digambarulamani telisikoni an̄jūrapu ākulu kuṭṭi tamaku kaccaḍamulanu cēsikoniri.౹

God Arraigns Adam and Eve

8 చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండ తోటచెట్లమధ్యను దాగు కొనగా
 
Callapūṭanu ādāmunu atani bhāryayu tōṭalō san̄carin̄cucunna dēvuḍaina yehōvā svaramunu vini, dēvuḍaina yehōvā eduṭiki rākuṇḍa tōṭaceṭlamadhyanu dāgu konagā
9 దేవుడైన యెహోవా ఆదామును పిలిచి– నీవు ఎక్కడ ఉన్నావనెను.౹
 
Dēvuḍaina yehōvā ādāmunu pilici– nīvu ekkaḍa unnāvanenu.౹
10 అందుకతడు–నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటినిగనుక భయపడి దాగుకొంటిననెను.౹
 
Andukataḍu–nēnu tōṭalō nī svaramu vininappuḍu digambarinigā nuṇṭiniganuka bhayapaḍi dāgukoṇṭinanenu.౹
11 అందుకాయన–నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను.౹
 
Andukāyana–nīvu digambarivani nīku telipinavāḍevaḍu? Nīvu tinakūḍadani nēnu nī kājñāpin̄cina vr̥kṣaphalamulu tiṇṭivā? Ani aḍigenu.౹
12 అందుకు ఆదాము–నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.౹
 
Anduku ādāmu–nātō nuṇḍuṭaku nīvu nākiccina ī strīyē ā vr̥kṣaphalamulu konni nā kiyyagā nēnu tiṇṭinanenu.౹
13 అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో–నీవు చేసినది యేమిటని అడుగగా స్త్రీ–సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను.౹
 
Appuḍu dēvuḍaina yehōvā strītō–nīvu cēsinadi yēmiṭani aḍugagā strī–sarpamu nannu mōsapucci nanduna tiṇṭinanenu.౹

The Fate of the Serpent

14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువు లన్నిటిలోను నీవు శపించ బడినదానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రదుకు దినములన్నియు మన్ను తిందువు.౹
 
Anduku dēvuḍaina yehōvā sarpamutō nīvu dīni cēsinanduna paśuvulanniṭilōnu bhūjantuvu lanniṭilōnu nīvu śapin̄ca baḍinadānivai nī kaḍuputō prākucu nīvu braduku dinamulanniyu mannu tinduvu.౹
15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.౹
 
Mariyu nīkunu strīkini nī santānamunakunu āme santānamunakunu vairamu kalugajēsedanu. Adi ninnu talamīda koṭṭunu; nīvu dānini maḍimemīda koṭṭuduvani ceppenu.౹

The Punishment of Mankind

16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను.౹
 
Āyana strītō nī prayāsamunu nī garbhavēdananu nēnu mikkili heccin̄cedanu; vēdanatō pillalanu kanduvu; nī bhartayeḍala nīku vān̄cha kalugunu; ataḍu ninnu ēlunani ceppenu.౹
17 ఆయన ఆదాముతో–నీవు నీ భార్యమాట విని–తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;౹
 
Āyana ādāmutō–nīvu nī bhāryamāṭa vini–tinavaddani nēnu nī kājñāpin̄cina vr̥kṣaphalamulu tiṇṭivi ganuka nī nimittamu nēla śapimpabaḍiyunnadi; prayāsamutōnē nīvu braduku dinamulanniyu dāni paṇṭa tinduvu;౹
18 అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు;౹
 
Adi muṇḍla tuppalanu gaccapodalanu nīku molipin̄cunu; polamulōni paṇṭa tinduvu;౹
19 నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.౹
 
Nīvu nēlaku tirigi cēruvaraku nī mukhapu cemaṭa kārci āhāramu tinduvu; ēlayanagā nēlanuṇḍi nīvu tīyabaḍitivi; nīvu mannē ganuka tirigi mannaipōduvani ceppenu.౹
20 ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.౹
 
Ādāmu tana bhāryaku havva ani pēru peṭṭenu. Ēlayanagā āme jīvamugala prativānikini talli.౹

The Expulsion from Paradise

21 దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను.
 
Dēvuḍaina yehōvā ādāmunakunu atani bhāryakunu carmapu cokkāyilanu cēyin̄ci vāriki toḍigin̄cenu.
22 అప్పుడు దేవుడైన యెహోవా–ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొనితిని నిరంతరము జీవించునేమో అని
 
Appuḍu dēvuḍaina yehōvā–idigō man̄ci ceḍḍalanu erugunaṭlu, ādāmu manalō okanivaṇṭivāḍāyenu. Kābaṭṭi ataḍu oka vēḷa tana ceyyi cāci jīva vr̥kṣaphalamunu kūḍa tīsikonitini nirantaramu jīvin̄cunēmō ani
23 దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను.౹
 
Dēvuḍaina yehōvā ataḍu ē nēlanuṇḍi tīyabaḍenō dāni sēdyaparacuṭaku ēdenu tōṭalōnuṇḍi atani pampivēsenu.౹
24 అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.
 
Appuḍāyana ādāmunu veḷlagoṭṭi ēdenu tōṭaku tūrpudikkuna kerūbulanu, jīvavr̥kṣamunaku pōvu mārgamunu kācuṭaku iṭu aṭu tirugucunna khaḍgajvālanu niluvabeṭṭenu.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.