PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.2.1

ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.౹
 
Ākāśamunu bhūmiyu vāṭilōnunna samasta samūhamunu sampūrti cēyabaḍenu.౹

ఆదికాండము 2
ఆదికాండము 2:1-3

The Seventh Day—God Rest

The Seventh Day—God Rest
1 ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను.౹
 
Ākāśamunu bhūmiyu vāṭilōnunna samasta samūhamunu sampūrti cēyabaḍenu.౹
2 దేవుడు తాను చేసిన తన పని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పనియంతటినుండి యేడవదినమున విశ్రమించెను.౹
 
Dēvuḍu tānu cēsina tana pani yēḍavadinamulōgā sampūrticēsi, tānu cēsina tana paniyantaṭinuṇḍi yēḍavadinamuna viśramin̄cenu.౹
3 కాబట్టి దేవుడు ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను.
 
Kābaṭṭi dēvuḍu ā yēḍava dinamunu āśīrvadin̄ci pariśud'dhaparacenu; ēlayanagā dānilō dēvuḍu tānu cēsinaṭṭiyu, sr̥jin̄ci naṭṭiyu tana pani antaṭinuṇḍi viśramin̄cenu.

Man and Woman in the Garden

The First Man - Adam
4 దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమ్యాకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తిక్రమము ఇదే.౹
 
Dēvuḍaina yehōvā bhūmini ākāśamunu cēsina dinamandu bhūmyākāśamulu sr̥jin̄cabaḍinappuḍu vāṭi vāṭi utpattikramamu idē.౹
5 అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడులేడు;౹
 
Adivaraku polamandali yē podayu bhūmimīda nuṇḍalēdu. Polamandali yē ceṭṭunu molavalēdu; ēlayanagā dēvuḍaina yehōvā bhūmimīda vāna kuripin̄calēdu, nēlanu sēdyaparacuṭaku naruḍulēḍu;౹
6 అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.౹
 
Ayitē āviri bhūminuṇḍi lēci nēla antaṭini taḍipenu.౹
7 దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.౹
 
Dēvuḍaina yehōvā nēlamaṇṭitō naruni nirmin̄ci vāni nāsikā randhramulalō jīvavāyuvunu ūdagā naruḍu jīvātma āyenu.౹
God’s Garden - Tree of Life & Knowledge
8 దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటవేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను.౹
 
Dēvuḍaina yehōvā tūrpuna ēdenulō oka tōṭavēsi tānu nirmin̄cina naruni dānilō un̄cenu.౹
9 మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోటమధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేలనుండి మొలిపించెను.౹
 
Mariyu dēvuḍaina yehōvā cūpunaku ramyamainadiyu āhāramunaku man̄cidiyunaina prati vr̥kṣamunu, ā tōṭamadhyanu jīvavr̥kṣamunu, man̄ci ceḍḍala teliviniccu vr̥kṣamunu nēlanuṇḍi molipin̄cenu.౹
10 మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను.౹
 
Mariyu ā tōṭanu taḍupuṭaku ēdenulōnuṇḍi oka nadi bayaludēri akkaḍanuṇḍi cīlipōyi nālugu śākhalāyenu.౹
11 మొదటిదాని పేరు పీషోను; అది హవీలా దేశమంతటి చుట్టు పారుచున్నది; అక్కడ బంగారమున్నది.౹
 
Modaṭidāni pēru pīṣōnu; adi havīlā dēśamantaṭi cuṭṭu pārucunnadi; akkaḍa baṅgāramunnadi.౹
12 ఆ దేశపు బంగారము శ్రేష్ఠమైనది; అక్కడ బోళమును గోమేధికములును దొరుకును.౹
 
Ā dēśapu baṅgāramu śrēṣṭhamainadi; akkaḍa bōḷamunu gōmēdhikamulunu dorukunu.౹
13 రెండవ నది పేరు గీహోను; అది కూషు దేశమంతటి చుట్టు పారుచున్నది.౹
 
Reṇḍava nadi pēru gīhōnu; adi kūṣu dēśamantaṭi cuṭṭu pārucunnadi.౹
14 మూడవ నది పేరు హిద్దెకెలు; అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు
 
Mūḍava nadi pēru hiddekelu; adi aṣṣūru tūrpu vaipuna pārucunnadi. Nālugava nadi yūphraṭīsu
15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను.౹
 
Mariyu dēvuḍaina yehōvā naruni tīsikoni ēdenu tōṭanu sēdyaparacuṭakunu dāni kācuṭakunu dānilō un̄cenu.౹
16 మరియు దేపుడైన యెహోవా–ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును;౹
 
Mariyu dēpuḍaina yehōvā–ī tōṭalōnunna prati vr̥kṣa phalamulanu nīvu nirabhyantaramugā tinavaccunu;౹
17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.
 
Ayitē man̄ci ceḍḍala teliviniccu vr̥kṣa phalamulanu tinakūḍadu; nīvu vāṭini tinu dinamuna niścayamugā caccedavani naruni kājñāpin̄cenu.
The First Woman - Eve
18 మరియు దేవుడైన యెహోవా–నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.౹
 
Mariyu dēvuḍaina yehōvā–naruḍu oṇṭarigā nuṇḍuṭa man̄cidi kādu; vāniki sāṭiyaina sahāyamunu vānikoraku cēyudunanukonenu.౹
19 దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను.౹
 
Dēvuḍaina yehōvā prati bhūjantuvunu prati ākāśapakṣini nēlanuṇḍi nirmin̄ci, ādāmu vāṭiki ē pēru peṭṭunō cūcuṭaku atani yoddaku vāṭini rappin̄cenu. Jīvamugala pratidāniki ādāmu ē pēru peṭṭenō ā pēru dāniki kaligenu.౹
20 అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశపక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను.౹
 
Appuḍu ādāmu samasta paśuvulakunu ākāśapakṣulakunu samasta bhūjantuvulakunu pērulu peṭṭenu. Ayinanu ādāmunaku sāṭiyaina sahāyamu ataniki lēka pōyenu.౹
21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను.౹
 
Appuḍu dēvuḍaina yehōvā ādāmunaku gāḍhanidra kalugajēsi ataḍu nidrin̄cinappuḍu atani prakka ṭemukalalō oka dānini tīsi ā cōṭunu mānsamutō pūḍci vēsenu.౹
22 తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను.౹
 
Taruvāta dēvuḍaina yehōvā tānu ādāmu nuṇḍi tīsina prakkaṭemukanu strīnigā nirmin̄ci āmenu ādāmu noddaku tīsikonivaccenu.౹
23 అప్పుడు ఆదాము ఇట్లనెను – నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.
 
Appuḍu ādāmu iṭlanenu – nā yemukalalō oka yemuka nā mānsamulō mānsamu idi narunilōnuṇḍi tīyabaḍenu ganuka nāri anabaḍunu.
24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
 
Kābaṭṭi puruṣuḍu tana taṇḍrini tana tallini viḍici tana bhāryanu hattukonunu; vāru ēka śarīramaiyunduru.
Naked - Not Ashamed
25 అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి; అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి.
 
Appuḍu ādāmunu atani bhāryayu vāriddaru digambarulugā nuṇḍiri; ayitē vāru siggu erugaka yuṇḍiri.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.