PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.13.1

అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులోనుండి నెగెబునకు వెళ్లెను.౹
 
Abrāmu tanaku kaligina samastamunu tana bhāryanu tanatōkūḍanunna lōtunu veṇṭabeṭṭukoni aiguptulōnuṇḍi negebunaku veḷlenu.౹

ఆదికాండము 13
ఆదికాండము 13:1-9

Abram and Lot Part Ways

1 అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులోనుండి నెగెబునకు వెళ్లెను.౹
 
Abrāmu tanaku kaligina samastamunu tana bhāryanu tanatōkūḍanunna lōtunu veṇṭabeṭṭukoni aiguptulōnuṇḍi negebunaku veḷlenu.౹
2 అబ్రాము వెండి బంగారము పశువులుకలిగి బహు ధనవంతుడై యుండెను.౹
 
Abrāmu veṇḍi baṅgāramu paśuvulukaligi bahu dhanavantuḍai yuṇḍenu.౹
3 అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి
 
Ataḍu prayāṇamu cēyucu dakṣiṇamunuṇḍi bētēluvaraku, anagā bētēlukunu hāyikini madhya tana guḍāramu modaṭa uṇḍina sthalamuvaraku veḷli
4 తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹
 
Tānu modaṭa balipīṭhamunu kaṭṭinacōṭa cērenu. Akkaḍa abrāmu yehōvā nāmamuna prārthana cēsenu.౹
5 అబ్రాముతోకూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక
 
Abrāmutōkūḍa veḷlina lōtukunu goṟṟelu goḍlu guḍāramulu uṇḍenu ganuka
6 వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.౹
 
Vāru kalisi nivasin̄cuṭaku ā pradēśamu cālaka pōyenu; endukanagā vāri āsti vāru kalisi nivasin̄calēnanta vistāramaiyuṇḍenu.౹
7 అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.౹
 
Appuḍu abrāmu paśuvula kāparulakunu lōtu paśuvula kāparulakunu kalahamu puṭṭenu. Ā kālamandu kanānīyulu perijjīyulu ā dēśamulō kāpuramuṇḍiri.౹
8 కాబట్టి అబ్రాము –మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు.౹
 
Kābaṭṭi abrāmu –manamu bandhuvulamu ganuka nāku nīkunu, nā paśuvula kāparulaku nī paśuvula kāparulakunu kalahamuṇḍakūḍadu.౹
9 ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లినయెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా
 
Ī dēśamantayu nī yeduṭa nunnadigadā, dayacēsi nannu viḍici vērugānuṇḍumu. Nīvu eḍamataṭṭunaku veḷlinayeḍala nēnu kuḍitaṭṭukunu, nīvu kuḍitaṭṭunaku veḷlinayeḍala nēnu yeḍamataṭṭunakunu veḷludunani lōtutō ceppagā

Lot Proceeds toward Sodom

10 లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.౹
 
Lōtu tana kannuletti yordānu prāntamantaṭini cūcenu. Yehōvā sodoma gomoṟṟā anu paṭṭaṇamulanu nāśanamu cēyakamunupu sōyaruku vaccuvaraku adantayu yehōvā tōṭavalenu aiguptu dēśamuvalenu nīḷlu pāru dēśamaiyuṇḍenu.౹
11 కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లువారు ఒకరి కొకరు వేరై పోయిరి.౹
 
Kābaṭṭi lōtu tanaku yordānu prāntamantaṭini ērparacukoni tūrpugā prayāṇamucēsenu. Aṭluvāru okari kokaru vērai pōyiri.౹
12 అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను.౹
 
Abrāmu kanānulō nivasin̄cenu. Lōtu ā maidānamandunna paṭṭaṇamula pradēśamulalō kāpuramuṇḍi sodomadaggara tana guḍāramu vēsikonenu.౹
13 సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునైయుండిరి.౹
 
Sodoma manuṣyulu duṣṭulunu, yehōvā dr̥ṣṭiki bahu pāpulunaiyuṇḍiri.౹

God Renews the Promise to Abram

14 లోతు అబ్రామును విడిచి పోయినతరువాత యెహోవా–ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము;౹
 
Lōtu abrāmunu viḍici pōyinataruvāta yehōvā–idigō nī kannuletti nīvu unnacōṭanuṇḍi uttaraputaṭṭu dakṣiṇaputaṭṭu tūrputaṭṭu paḍamarataṭṭunu cūḍumu;౹
15 ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.౹
 
Endukanagā nīvu cūcucunna yī dēśamantaṭini nīkunu nī santānamunakunu sadākālamu iccedanu.౹
16 మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలె విస్తరింప చేసెదను; ఎట్ల నగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.౹
 
Mariyu nī santānamunu bhūmimīdanuṇḍu rēṇuvulavale vistarimpa cēsedanu; eṭla nagā okaḍu bhūmimīdanuṇḍu rēṇuvulanu lekkimpa galiginayeḍala nī santānamunu kūḍa lekkimpavaccunu.౹
17 నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.౹
 
Nīvu lēci yī dēśamuyokka poḍuguna veḍalpuna dānilō san̄carin̄cumu; adi nīkiccedanani abrāmutō ceppenu.౹
18 అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రేదగ్గరనున్న సింధూరవృక్షవనములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
 
Appuḍu abrāmu tana guḍāramu tīsi hebrōnulōni mamrēdaggaranunna sindhūravr̥kṣavanamulōdigi akkaḍa yehōvāku balipīṭhamunu kaṭṭenu.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.