PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.1.1

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.౹
 
Ādiyandu dēvuḍu bhūmyākāśamulanu sr̥jin̄cenu.౹

ఆదికాండము 1
ఆదికాండము 1:1-31
ఆదికాండము 1:1-2

The Creation

Heaven and Earth
1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.౹
 
Ādiyandu dēvuḍu bhūmyākāśamulanu sr̥jin̄cenu.౹
2 భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను.౹
 
Bhūmi nirākāramugānu śūn'yamugānu uṇḍenu; cīkaṭi agādha jalamu paina kam'miyuṇḍenu; dēvuni ātma jalamulapaina allāḍucuṇḍenu.౹
The First Day—Light
3 దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.౹
 
Dēvuḍu–velugu kam'mani palukagā velugu kaligenu.౹
4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను.౹
 
Velugu man̄cidainaṭṭu dēvuḍu cūcenu; dēvuḍu velugunu cīkaṭini vēruparacenu.౹
5 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను.౹
 
Dēvuḍu velugunaku pagalaniyu, cīkaṭiki rātri aniyu pēru peṭṭenu. Astamayamunu udayamunu kalugagā oka dinamāyenu.౹
The Second Day—Heaven
6 మరియు దేవుడు–జలములమధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను.౹
 
Mariyu dēvuḍu–jalamulamadhya noka viśālamu kaligi ā jalamulanu ī jalamulanu vēruparacunu gākani palikenu.౹
7 దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆప్రకారమాయెను.౹
 
Dēvuḍu ā viśālamu cēsi viśālamu krindi jalamulanu viśālamu mīdi jalamulanu vēruparapagā āprakāramāyenu.౹
8 దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవదినమాయెను.౹
 
Dēvuḍu ā viśālamunaku ākāśamani pēru peṭṭenu. Astamayamunu udayamunu kalugagā reṇḍavadinamāyenu.౹
The Third Day—Earth, Seas and Plants
9 దేవుడు–ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆప్రకారమాయెను.౹
 
Dēvuḍu–ākāśamu krindanunna jalamu lokacōṭanē kūrcabaḍi ārina nēla kanabaḍunu gākani palukagā āprakāramāyenu.౹
10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను.౹
 
Dēvuḍu ārina nēlaku bhūmi ani pēru peṭṭenu, jalarāśiki āyana samudramulani pēru peṭṭenu, adi man̄cidani dēvuḍu cūcenu.౹
11 దేవుడు– గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆప్రకార మాయెను.౹
 
Dēvuḍu– gaḍḍini vittanamuliccu ceṭlanu bhūmimīda tamatama jāti prakāramu tamalō vittanamulugala phalamiccu phalavr̥kṣamulanu bhūmi molipin̄cugākani palukagā āprakāra māyenu.౹
12 భూమి గడ్డిని తమతమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమతమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను.౹
 
Bhūmi gaḍḍini tamatama jāti prakāramu vittanamuliccu ceṭlanu, tamatama jāti prakāramu tamalō vittanamulugala phalavr̥kṣamulanu molipimpagā adi man̄cidani dēvuḍu cūcenu.౹
13 అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను.౹
 
Astamayamunu udayamunu kalugagā mūḍava dinamāyenu.౹
The Fourth Day—Sun, Moon, and Stars
14 దేవుడు–పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు,౹
 
Dēvuḍu–pagaṭini rātrini vēruparacunaṭlu ākāśaviśālamandu jyōtulu kalugunu gākaniyu, avi sūcanalanu kālamulanu dina sanvatsaramulanu sūcin̄cuṭakai yuṇḍu gākaniyu,౹
15 భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆప్రకారమాయెను.౹
 
Bhūmimīda velugiccuṭaku avi ākāśa viśālamandu jyōtulai yuṇḍu gākaniyu palikenu; āprakāramāyenu.౹
16 దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను.౹
 
Dēvuḍu ā reṇḍu goppa jyōtulanu, anagā pagaṭini ēluṭaku pedda jyōtini rātrini ēluṭaku cinna jyōtini nakṣatramulanu cēsenu.౹
17 భూమిమీద వెలు గిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.౹
 
Bhūmimīda velu giccuṭakunu pagaṭini rātrini ēluṭakunu velugunu cīka ṭini vēruparacuṭakunu dēvuḍu ākāśa viśālamandu vāṭi nun̄cenu; adi man̄cidani dēvuḍu cūcenu.౹
18 భూమిమీద వెలు గిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను.౹
 
Bhūmimīda velu giccuṭakunu pagaṭini rātrini ēluṭakunu velugunu cīka ṭini vēruparacuṭakunu dēvuḍu ākāśa viśālamandu vāṭi nun̄cenu; adi man̄cidani dēvuḍu cūcenu.౹
19 అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను.౹
 
Astamayamunu udayamunu kalugagā nālugava dinamāyenu.౹
The Fifth Day—Fish and Birds
20 దేవుడు–జీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను.౹
 
Dēvuḍu–jīvamukaligi calin̄cuvāṭini jalamulu samr̥ d'dhigā puṭṭin̄cunu gākaniyu, pakṣulu bhūmipaini ākāśa viśālamulō egurunu gākaniyu palikenu.౹
21 దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృ ద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను.౹
 
Dēvuḍu jalamulalō vāṭi vāṭi jāti prakāramu jalamulu samr̥ d'dhigā puṭṭin̄cina mahā matsyamulanu, jīvamukaligi calin̄cu vāṭinanniṭini, dāni dāni jāti prakāramu rekkalugala prati pakṣini sr̥jin̄cenu. Adi man̄cidani dēvuḍu cūcenu.౹
22 దేవుడు–మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వదించెను.౹
 
Dēvuḍu–mīru phalin̄ci abhivr̥d'dhipondi samudra jalamulalō niṇḍi yuṇḍuḍaniyu, pakṣulu bhūmimīda vistarin̄cunu gākaniyu, vāṭini āśīrvadin̄cenu.౹
23 అస్తమయమును ఉదయమును కలుగగా అయిదవ దినమాయెను.౹
 
Astamayamunu udayamunu kalugagā ayidava dinamāyenu.౹
The Sixth Day—Land Animals and Mankind
24 దేవుడు–వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను; ఆప్రకారమాయెను.౹
 
Dēvuḍu–vāṭi vāṭi jāti prakāramu jīvamugala vāṭini, anagā vāṭi vāṭi jāti prakāramu paśuvulanu purugulanu aḍavi jantuvulanu bhūmi puṭṭin̄cugākani palikenu; āprakāramāyenu.౹
25 దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను.౹
 
Dēvuḍu āyā jātula prakāramu aḍavi jantuvulanu, āyā jātula prakāramu paśuvulanu, āyā jātula prakāramu nēlanu prāku prati purugunu cēsenu. Adiman̄cidani dēvuḍu cūcenu.౹
26 దేవుడు–మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారు సముద్రపు చేపలను ఆకాశపక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.౹
 
Dēvuḍu–mana svarūpamandu mana pōlike coppuna narulanu cēyudamu; vāru samudrapu cēpalanu ākāśapakṣulanu paśuvulanu samasta bhūmini bhūmimīda prāku prati jantuvunu ēludurugākaniyu palikenu.౹
27 దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.౹
 
Dēvuḍu tana svarūpamandu naruni sr̥jin̄cenu; dēvuni svarūpamandu vāni sr̥jin̄cenu; strīnigānu puruṣunigānu vārini sr̥jin̄cenu.౹
28 దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా–మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.౹
 
Dēvuḍu vārini āśīrvadin̄cenu; eṭlanagā–mīru phalin̄ci abhivr̥d'dhipondi vistarin̄ci bhūmini niṇḍin̄ci dānini lōparacukonuḍi; samudrapu cēpalanu ākāśapakṣulanu bhūmimīda prāku prati jīvini ēluḍani dēvuḍu vāritō ceppenu.౹
29 దేవుడు– ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చియున్నాను; అవి మీ కాహారమగును.౹
 
Dēvuḍu– idigō bhūmimīdanunna vittanamuliccu prati ceṭṭunu vittanamuliccu vr̥kṣaphalamugala prati vr̥kṣamunu mī kicciyunnānu; avi mī kāhāramagunu.౹
30 భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగు నని పలికెను. ఆప్రకారమాయెను.౹
 
Bhūmimīdanuṇḍu jantuvulanniṭikini ākāśapakṣulanniṭikini bhūmimīda prāku samasta jīvulakunu paccani ceṭlanniyu āhāramagu nani palikenu. Āprakāramāyenu.౹
31 దేవుడు తాను చేసి నది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
 
Dēvuḍu tānu cēsi nadi yāvattunu cūcinappuḍu adi cālaman̄cidiga nuṇḍenu. Astamayamunu udayamunu kalugagā ārava dinamāyenu.
ఆదికాండము 1:1 కోసం చిత్రణఆదికాండము 1:1 కోసం చిత్రణ

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.