PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.9.1
IRVTel దేవుడు

దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.
 
Dēvuḍu nōvahunū atani koḍukulanū āśīrvadin̄cāḍu. “Mīru phalin̄ci abhivr̥d'dhi pondi bhūmini nimpaṇḍi.

ఆది 9
ఆది 9:1-17

The Covenant of the Rainbow

1 దేవుడు నోవహునూ అతని కొడుకులనూ ఆశీర్వదించాడు. “మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి.
 
Dēvuḍu nōvahunū atani koḍukulanū āśīrvadin̄cāḍu. “Mīru phalin̄ci abhivr̥d'dhi pondi bhūmini nimpaṇḍi.
2 అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద పాకే ప్రతి పురుగుకూ సముద్రపు చేపలన్నిటికీ మీరంటే భయం ఉంటుంది, అవి మిమ్మల్ని చూసి బెదురుతాయి.
 
Aḍavi jantuvulanniṭikī ākāśa pakṣulanniṭikī nēla mīda pākē prati purugukū samudrapu cēpalanniṭikī mīraṇṭē bhayaṁ uṇṭundi, avi mim'malni cūsi bedurutāyi.
3 ప్రాణంతో కదలాడే ప్రతి జీవీ మీకు ఆహారం అవుతుంది. పచ్చని మొక్కలను ఇచ్చినట్టు ఇప్పుడు నేను ఇవన్నీ మీకు ఇచ్చాను.
 
Prāṇantō kadalāḍē prati jīvī mīku āhāraṁ avutundi. Paccani mokkalanu iccinaṭṭu ippuḍu nēnu ivannī mīku iccānu.
4 కాని ప్రాణమే రక్తం గనుక మీరు మాంసాన్ని దాని రక్తంతో పాటు తినకూడదు.
 
Kāni prāṇamē raktaṁ ganuka mīru mānsānni dāni raktantō pāṭu tinakūḍadu.
5 మీకు ప్రాణం అయిన మీ రక్తం గురించి లెక్క అడుగుతాను. దాని గురించి ప్రతి జంతువునీ ప్రతి మనిషినీ లెక్క అడుగుతాను. ప్రతి మనిషిని, అంటే తన సోదరుణ్ణి హత్యచేసిన ప్రతి మనిషినీ ఆ మనిషి ప్రాణం లెక్క అడుగుతాను.
 
Mīku prāṇaṁ ayina mī raktaṁ gurin̄ci lekka aḍugutānu. Dāni gurin̄ci prati jantuvunī prati maniṣinī lekka aḍugutānu. Prati maniṣini, aṇṭē tana sōdaruṇṇi hatyacēsina prati maniṣinī ā maniṣi prāṇaṁ lekka aḍugutānu.
6 దేవుడు తన స్వరూపంలో మనిషిని చేశాడు గనుక మనిషి రక్తాన్ని ఎవరు చిందిస్తారో, అతని రక్తాన్ని కూడా మనిషే చిందించాలి.
 
Dēvuḍu tana svarūpanlō maniṣini cēśāḍu ganuka maniṣi raktānni evaru cindistārō, atani raktānni kūḍā maniṣē cindin̄cāli.
7 మీరు ఫలించి అభివృద్ధి పొందండి. మీరు భూమి మీద అధికంగా సంతానం కని విస్తరించండి” అని వాళ్ళతో చెప్పాడు.
 
Mīru phalin̄ci abhivr̥d'dhi pondaṇḍi. Mīru bhūmi mīda adhikaṅgā santānaṁ kani vistarin̄caṇḍi” ani vāḷḷatō ceppāḍu.
8 దేవుడు నోవహు, అతని కొడుకులతో మాట్లాడుతూ,
 
Dēvuḍu nōvahu, atani koḍukulatō māṭlāḍutū,
9 “వినండి, నేను మీతోను, మీ తరువాత వచ్చే మీ సంతానంతోను,
 
“Vinaṇḍi, nēnu mītōnu, mī taruvāta vaccē mī santānantōnu,
10 మీతో పాటు ఉన్న ప్రతి జీవితోను, అవి పక్షులే గాని పశువులే గాని, మీతోపాటు ఉన్న ప్రతి జంతువే గాని, ఓడలోనుంచి బయటకు వచ్చిన ప్రతి భూజంతువుతో నా నిబంధన స్థిరం చేస్తున్నాను.
 
Mītō pāṭu unna prati jīvitōnu, avi pakṣulē gāni paśuvulē gāni, mītōpāṭu unna prati jantuvē gāni, ōḍalōnun̄ci bayaṭaku vaccina prati bhūjantuvutō nā nibandhana sthiraṁ cēstunnānu.
11 నేను మీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను. సర్వ శరీరులు ప్రవహించే జలాల వల్ల ఇంకెప్పుడూ నాశనం కారు. భూమిని నాశనం చెయ్యడానికి ఇంకెప్పుడూ జలప్రళయం రాదు” అన్నాడు.
 
Nēnu mītō nā nibandhana sthiraparustunnānu. Sarva śarīrulu pravahin̄cē jalāla valla iṅkeppuḍū nāśanaṁ kāru. Bhūmini nāśanaṁ ceyyaḍāniki iṅkeppuḍū jalapraḷayaṁ rādu” annāḍu.
12 దేవుడు “నాకు, మీకు, మీతోపాటు ఉన్న జీవరాసులన్నిటికీ మధ్య నేను తరతరాలకు చేస్తున్న నిబంధనకు గుర్తు ఇదే,
 
Dēvuḍu “nāku, mīku, mītōpāṭu unna jīvarāsulanniṭikī madhya nēnu taratarālaku cēstunna nibandhanaku gurtu idē,
13 మేఘంలో నా ధనుస్సు ఉంచాను. అది నాకు, భూమికి, మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది.
 
Mēghanlō nā dhanus'su un̄cānu. Adi nāku, bhūmiki, madhya nibandhanaku gurtugā uṇṭundi.
14 భూమిమీదికి నేను మేఘాన్ని తీసుకొచ్చినప్పుడు మేఘంలో ఆ ధనుస్సు కనబడుతుంది.
 
Bhūmimīdiki nēnu mēghānni tīsukoccinappuḍu mēghanlō ā dhanus'su kanabaḍutundi.
15 అప్పుడు నాకు, మీకు, జీవరాసులన్నిటికీ మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకొంటాను గనుక సర్వశరీరులను నాశనం చెయ్యడానికి ఇక ఎన్నడూ నీళ్ళు జలప్రళయంగా రావు.
 
Appuḍu nāku, mīku, jīvarāsulanniṭikī madhya unna nā nibandhana jñāpakaṁ cēsukoṇṭānu ganuka sarvaśarīrulanu nāśanaṁ ceyyaḍāniki ika ennaḍū nīḷḷu jalapraḷayaṅgā rāvu.
16 ఆ ధనుస్సు మేఘంలో ఉంటుంది. నేను దాన్ని చూసి దేవునికీ, భూమి మీద ఉన్న సర్వశరీరుల్లో ప్రాణం ఉన్న ప్రతి దానికీ మధ్య ఉన్న శాశ్వత నిబంధనను జ్ఞాపకం చేసుకొంటాను” అన్నాడు.
 
Ā dhanus'su mēghanlō uṇṭundi. Nēnu dānni cūsi dēvunikī, bhūmi mīda unna sarvaśarīrullō prāṇaṁ unna prati dānikī madhya unna śāśvata nibandhananu jñāpakaṁ cēsukoṇṭānu” annāḍu.
17 దేవుడు “నాకు, భూమిమీద ఉన్న సర్వశరీరులకు మధ్య నేను స్థిరం చేసిన నిబంధనకు గుర్తు ఇదే” అని నోవహుతో చెప్పాడు.
 
Dēvuḍu “nāku, bhūmimīda unna sarvaśarīrulaku madhya nēnu sthiraṁ cēsina nibandhanaku gurtu idē” ani nōvahutō ceppāḍu.

Noah’s Shame and Canaan’s Curse

18 ఓడలోనుంచి వచ్చిన నోవహు ముగ్గురు కొడుకులు షేము, హాము, యాపెతు. హాము కనానుకు తండ్రి.
 
Ōḍalōnun̄ci vaccina nōvahu mugguru koḍukulu ṣēmu, hāmu, yāpetu. Hāmu kanānuku taṇḍri.
19 వీళ్ళ సంతానం, భూమి అంతటా వ్యాపించింది.
 
Vīḷḷa santānaṁ, bhūmi antaṭā vyāpin̄cindi.
20 నోవహు భూమిని సాగుచేయడం ప్రారంభించి, ద్రాక్షతోట వేశాడు.
 
Nōvahu bhūmini sāgucēyaḍaṁ prārambhin̄ci, drākṣatōṭa vēśāḍu.
21 ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు.
 
Ā drākṣārasaṁ tāgi mattekki tana guḍāranlō baṭṭalu lēkuṇḍā paḍi unnāḍu.
22 అప్పుడు కనాను తండ్రి అయిన హాము, తన తండ్రి బట్టలు లేకుండా పడి ఉండడం చూసి, బయట ఉన్న తన ఇద్దరు సోదరులకు ఆ విషయం చెప్పాడు.
 
Appuḍu kanānu taṇḍri ayina hāmu, tana taṇḍri baṭṭalu lēkuṇḍā paḍi uṇḍaḍaṁ cūsi, bayaṭa unna tana iddaru sōdarulaku ā viṣayaṁ ceppāḍu.
23 అప్పుడు షేము, యాపెతు, ఒక బట్ట తీసుకుని తమ ఇద్దరి భుజాల మీద వేసుకుని వెనుకగా నడిచివెళ్ళి తమ తండ్రి నగ్న శరీరానికి కప్పారు. వాళ్ళ ముఖాలు మరొక వైపు తిరిగి ఉన్నాయి గనుక వాళ్ళు తమ తండ్రి నగ్న శరీరం చూడలేదు.
 
Appuḍu ṣēmu, yāpetu, oka baṭṭa tīsukuni tama iddari bhujāla mīda vēsukuni venukagā naḍiciveḷḷi tama taṇḍri nagna śarīrāniki kappāru. Vāḷḷa mukhālu maroka vaipu tirigi unnāyi ganuka vāḷḷu tama taṇḍri nagna śarīraṁ cūḍalēdu.
24 అప్పుడు నోవహు మత్తులోనుంచి మేల్కొని తన చిన్నకొడుకు చేసిన దాన్ని తెలుసుకున్నాడు.
 
Appuḍu nōvahu mattulōnun̄ci mēlkoni tana cinnakoḍuku cēsina dānni telusukunnāḍu.
25 “కనాను శపితుడు. అతడు తన సోదరులకు దాసుడుగా ఉంటాడు” అన్నాడు.
 
“Kanānu śapituḍu. Ataḍu tana sōdarulaku dāsuḍugā uṇṭāḍu” annāḍu.

Shem’s Blessing and Noah’s Death

26 అతడు “షేము దేవుడైన యెహోవా స్తుతి పొందుతాడు గాక. కనాను అతనికి సేవకుడవుతాడు గాక.
 
Ataḍu “ṣēmu dēvuḍaina yehōvā stuti pondutāḍu gāka. Kanānu ataniki sēvakuḍavutāḍu gāka.
27 దేవుడు యాపెతును అభివృద్ధి చేస్తాడు గాక. అతడు షేము గుడారాల్లో నివాసం ఉంటాడు. అతనికి కనాను సేవకుడవుతాడు” అన్నాడు.
 
Dēvuḍu yāpetunu abhivr̥d'dhi cēstāḍu gāka. Ataḍu ṣēmu guḍārāllō nivāsaṁ uṇṭāḍu. Ataniki kanānu sēvakuḍavutāḍu” annāḍu.
28 ఆ జలప్రళయం తరువాత నోవహు మూడు వందల ఏభై సంవత్సరాలు బ్రతికాడు.
 
Ā jalapraḷayaṁ taruvāta nōvahu mūḍu vandala ēbhai sanvatsarālu bratikāḍu.
29 నోవహు మొత్తం తొమ్మిదివందల ఏభై సంవత్సరాలు జీవించాడు.
 
Nōvahu mottaṁ tom'midivandala ēbhai sanvatsarālu jīvin̄cāḍu.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.