PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.6.1

మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు
 
Manuṣulu bhūmi mīda vistarin̄caḍaṁ modalupeṭṭāru. Vāḷlaku kūtuḷḷu puṭṭinappuḍu
Humans began to spread over the earth. When they had daughters

ఆది 6
ఆది 6:1-7
ఆది 6:1-22

Corruption on the Earth

The Corruption of Mankind
1 మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు
 
Manuṣulu bhūmi mīda vistarin̄caḍaṁ modalupeṭṭāru. Vāḷlaku kūtuḷḷu puṭṭinappuḍu
Humans began to spread over the earth. When they had daughters
2 దైవ కుమారులు#6:2 పరలోక ఆత్మలు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.
 
Daiva kumārulu manuṣula kūtuḷḷu andaṅgā uṇḍaḍaṁ cūsi, vāḷḷallō tamaku naccina strīlanu peḷḷi cēsukunnāru.
The sons of God saw that the daughters of men were beautiful, and married women of their choice among them.
3 యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు.
 
Yehōvā “jīvamiccē nā ūpiri manuṣullō ellakālaṁ uṇḍadu. Endukaṇṭē vāru balahīnamaina raktamānsālu galavāru. Vāru nūṭa iravai sanvatsarāla kaṇṭē ekkuva kālaṁ batakaru” annāḍu.
Jehovah said, "My breath of life shall not abide in men forever, for they are of weak flesh and blood. They shall not live more than a hundred and twenty years."
4 దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే.
 
Daiva kumārulu manuṣula kūtuḷḷanu peḷḷi cēsukunnappuḍu vāḷlaku pillalu puṭṭāru. Vīru ā rōjullō, ā taruvāta kūḍā bhūmi mīda unna dīrghadēhulu. Ī mahā kāyulu goppa śūrulu. Pūrvakālanlō pēruprakhyātulu gala vāru vīrē.
When the sons of God married the daughters of men, they had children. These were the long-bodied ones on the earth in those days and later. These Mahakayus are great warriors. These are the people who were famous in the past.
5 మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు.
 
Manuṣula durmārgaṁ bhūmimīda mitimīri pōyindani, vāḷḷa hr̥daya ālōcanā vidhānaṁ eppuḍū duṣṭatvamē ani yehōvā cūśāḍu.
Jehovah saw that the wickedness of men was great in the earth, and that the thoughts of their hearts were only wickedness.
6 తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు.
 
Tānu bhūmimīda manuṣulanu cēsinanduku bādhapaḍi, hr̥dayanlō vicārin̄cāḍu.
He grieved in his heart that he had made men on earth.
7 కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు.
 
Kābaṭṭi yehōvā “nēnu sr̥ṣṭin̄cina manuṣulanu ī bhūmimīda lēkuṇḍā cēstānu. Manuṣulatō pāṭu jantuvulanu, pākē jīvulanu, ākāśapakṣulanu bhūmimīda lēkuṇḍā tuḍici vēstānu. Endukaṇṭē nēnu vāḷḷanu sr̥ṣṭin̄cinanduku bādhapaḍutunnānu” annāḍu.
So Yahweh said, "I will destroy the people I have created from the earth. I will destroy the animals, the creeping creatures, and the birds of the air along with the humans, because I am sorry that I have created them."

Noah’s Favor with God

8 అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు.
 
Ayitē nōvahu yehōvā dr̥ṣṭilō anugrahaṁ pondāḍu.
But Noah found favor in Jehovah's eyes.
9 నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు.
 
Nōvahu gurin̄cina saṅgatulu ivē. Nōvahu nītiparuḍu. Atani taraṁ vāḷḷallō ninda lēnivāḍu. Nōvahu dēvunitō kalasi naḍicāḍu.
These are the things about Noah. Noah was righteous. He was blameless among those of his generation. Noah walked with God.
10 షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు.
 
Ṣēmu, hāmu, yāpetu anē mugguru koḍukulaku nōvahu taṇḍri ayyāḍu.
Noah became the father of three sons, Shem, Ham and Japheth.
11 దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది.
 
Dēvuni dr̥ṣṭilō lōkaṁ ceḍipōyindi. Adi hinsatō niṇḍipōyindi.
The world is corrupt in God's eyes. It was full of violence.
12 దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు.
 
Dēvuḍu lōkānni cūḍagā adi ceḍipōyi undi. Bhūmimīda manuṣulandarū tama mārgāllō ceḍipōyāru.
God saw the world and it was corrupt. All men on earth are corrupt in their ways.

Preparing the Ark

13 దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను.
 
Dēvuḍu nōvahutō “manuṣula mūlaṅgā bhūmi hinsatō niṇḍipōyindi ganuka vāḷḷanu antaṁ cēsē samayaṁ vaccinaṭṭu tēṭatellaṁ ayindi. Kaccitaṅgā ī bhūmitōpāṭu vāḷḷandarinī nāśanaṁ cēstānu.
God told Noah, "Because the earth is filled with violence because of the people, it is clear that the time has come to end them. I will surely destroy this earth and all of them.
14 కోనిఫర్ కలపతో నీ కోసం ఒక #6:14 పెద్ద పెట్టె ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి.
 
Kōniphar kalapatō nī kōsaṁ oka ōḍa sid'dhaṁ cēsukō. Gadulatō unna ōḍanu tayārucēsi, dāniki lōpalā bayaṭā tāru pūyāli.
Prepare for yourself a ship of conifer wood. A ship with chambers should be made and tarred inside and outside.
15 నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి.
 
Nuvvu dānni ceyyālsina vidhānaṁ idē. Ā ōḍa mūḍu vandala mūrala poḍavu, ēbhai mūrala veḍalpu, mupphai mūrala ettu uṇḍāli.
This is how you should do it. The ship was to be three hundred cubits long, fifty cubits wide, and thirty cubits high.
16 ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దాన్ని చెయ్యాలి.
 
Ā ōḍaku kiṭikī cēsi painun̄ci kindiki oka mūra dūranlō dānni bigin̄cāli. Ōḍaku oka pakka talupu un̄cāli. Mūḍu antasthulu uṇḍēlā dānni ceyyāli.
Make a window for that ship and fasten it at a distance of one cubit from top to bottom. A side door should be placed on the ship. It should be made to have three floors.
17 విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి.
 
Vinu, nēnu ūpiri unnavāṭanniṭinī ākāśaṁ kinda lēkuṇḍā nāśanaṁ ceyyaḍāniki bhūmi mīdiki jalapravāhaṁ rappin̄cabōtunnānu. Lōkanlō unnavannī canipōtāyi.
Listen, I am going to send a flood upon the earth to destroy everything that has breath under the heavens. Everything in the world dies.
18 కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు.
 
Kānī, nītō nā nibandhana neravērustānu. Nuvvu, nītōpāṭu nī koḍukulu, nī bhārya, nī kōḍaḷḷu ā ōḍalō pravēśistāru.
But, I will fulfill my covenant with you. You, your sons, your wife, and your daughters-in-law will enter the ship with you.
19 నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి.
 
Nītōpāṭu vāṭini kūḍā sajīvaṅgā un̄caḍaṁ kōsaṁ jīvulanniṭilō, aṇṭē, śarīraṁ unna prati jātilōnun̄ci reṇḍēsi coppuna nuvvu ōḍalōki tēvāli. Vāṭilō okaṭi magadi okaṭi āḍadi uṇḍāli.
Of all living things, that is, of every species that has a body, you shall take two into the ark to keep them alive with you. One of them should be male and one should be female.
20 అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి.
 
Avi canipōkuṇḍā uṇḍaḍāniki vāṭi vāṭi jātula prakāraṁ pakṣullō, vāṭi vāṭi jātula prakāraṁ jantuvullō, vāṭi vāṭi jātula prakāraṁ nēla mīda pākē vāṭanniṭlō, prati jātilō reṇḍēsi coppuna nī daggariki avē vastāyi.
Of the birds after their kind, of the beasts after their kind, of all creeping things of the ground after their kind, two of each kind shall come to you, that they may not die.
21 తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి” అని చెప్పాడు.
 
Tinaḍāniki kāvalasina annirakāla āhāra padārdhālu samakūrcukuni nī daggara un̄cukōvāli. Avi nīku, vāṭiki āhāraṁ avutāyi” ani ceppāḍu.
All kinds of food items that you need to eat should be prepared and kept with you. They will be food for you and for them.
22 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.
 
Dēvuḍu nōvahuku ājñāpin̄cina prakāraṁ ataḍu antā cēśāḍu.
As God commanded Noah, he did everything.
ఆది 6:1 కోసం చిత్రణ

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.