PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.5.1
IRVTel యేసు

ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
 
Ādāmu vanśakramaṁ idi. Dēvuḍu maniṣini sr̥ṣṭin̄cina rōjuna vāḷḷanu tana sonta pōlikalō cēśāḍu.

ఆది 5
ఆది 5:1-17

The Descendants of Adam

1 ఆదాము వంశక్రమం ఇది. దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలో చేశాడు.
 
Ādāmu vanśakramaṁ idi. Dēvuḍu maniṣini sr̥ṣṭin̄cina rōjuna vāḷḷanu tana sonta pōlikalō cēśāḍu.
2 వారిని పురుషులుగా, స్త్రీలుగా సృష్టించాడు. వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు.
 
Vārini puruṣulugā, strīlugā sr̥ṣṭin̄cāḍu. Vāḷḷanu sr̥ṣṭin̄cina rōjuna āyana vāḷḷanu āśīrvadin̄ci vāḷlaku manuṣulu ani pēru peṭṭāḍu.
3 ఆదాముకు నూట ముప్ఫై సంవత్సరాల వయస్సులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు. ఆదాము అతనికి షేతు అని పేరుపెట్టాడు.
 
Ādāmuku nūṭa mupphai sanvatsarāla vayas'sulō atani pōlikagā atani svarūpanlō koḍuku puṭṭāḍu. Ādāmu ataniki ṣētu ani pērupeṭṭāḍu.
4 షేతు పుట్టిన తరువాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు. అతనికి ఇంకా కొడుకులు, కూతుళ్ళు పుట్టారు.
 
Ṣētu puṭṭina taruvāta ādāmu enimidi vandala sanvatsarālu bratikāḍu. Ataniki iṅkā koḍukulu, kūtuḷḷu puṭṭāru.
5 ఆదాము తొమ్మిది వందల ముప్ఫై సంవత్సరాలు బ్రతికాడు.
 
Ādāmu tom'midi vandala mupphai sanvatsarālu bratikāḍu.
6 షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు.
 
Ṣētuku nūṭa aidu sanvatsarāla vayas'sulō enōṣu puṭṭāḍu.
7 ఎనోషు పుట్టిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
 
Enōṣu puṭṭina taruvāta ṣētu enimidi vandala ēḍu sanvatsarālu bratiki koḍukulanu, kūtuḷḷanu kannāḍu.
8 షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు.
 
Ṣētu tom'midi vandala panneṇḍu sanvatsarālu bratikāḍu.
9 ఎనోషుకు తొంభై సంవత్సరాల వయస్సులో కేయినాను పుట్టాడు.
 
Enōṣuku tombhai sanvatsarāla vayas'sulō kēyinānu puṭṭāḍu.
10 కేయినాను పుట్టిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
 
Kēyinānu puṭṭina taruvāta enōṣu enimidi vandala padihēnu sanvatsarālu bratiki koḍukulanu, kūtuḷḷanu kannāḍu.
11 ఎనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
 
Enōṣu tom'midi vandala aidu sanvatsarālu bratikāḍu.
12 కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.
 
Kēyinānuku ḍebbhai sanvatsarāla vayas'sulō mahalalēlu puṭṭāḍu.
13 మహలలేలు పుట్టిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
 
Mahalalēlu puṭṭina taruvāta kēyinānu enimidi vandala nalabhai sanvatsarālu bratiki koḍukulanu, kūtuḷḷanu kannāḍu.
14 కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు.
 
Kēyinānu tom'midi vandala padi sanvatsarālu bratikāḍu.
15 మహలలేలుకు#5:15 అంటే దేవునికి స్తుతి అరవై ఐదు సంవత్సరాల వయస్సులో యెరెదు పుట్టాడు.
 
Mahalalēluku aravai aidu sanvatsarāla vayas'sulō yeredu puṭṭāḍu.
16 యెరెదు పుట్టిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్ఫైసంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
 
Yeredu puṭṭina taruvāta mahalalēlu enimidi vandala mupphaisanvatsarālu bratiki koḍukulanu, kūtuḷḷanu kannāḍu.
17 మహలలేలు ఎనిమిదివందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
 
Mahalalēlu enimidivandala tombhai aidu sanvatsarālu bratikāḍu.

God Takes Up Enoch

18 యెరెదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయస్సులో హనోకు పుట్టాడు.
 
Yereduku nūṭa aravai reṇḍu sanvatsarāla vayas'sulō hanōku puṭṭāḍu.
19 హనోకు పుట్టిన తరువాత యెరెదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
 
Hanōku puṭṭina taruvāta yeredu enimidi vandala sanvatsarālu bratiki koḍukulanu, kūtuḷḷanu kannāḍu.
20 యెరెదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు.
 
Yeredu tom'midi vandala aravai reṇḍu sanvatsarālu bratikāḍu.
21 హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.
 
Hanōkuku aravai aidu sanvatsarāla vayas'sulō metūṣela puṭṭāḍu.
22 మెతూషెల పుట్టిన తరువాత హనోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
 
Metūṣela puṭṭina taruvāta hanōku mūḍu vandala sanvatsarālu dēvunitō sahavāsaṁ cēstū koḍukulanu, kūtuḷḷanu kannāḍu.
23 హనోకు మూడువందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు.
 
Hanōku mūḍuvandala aravai aidu sanvatsarālu bratikāḍu.
24 హనోకు దేవునితో కలసి నడిచాడు. దేవుడు అతణ్ణి తీసుకువెళ్ళాడు గనుక అతడు కనబడలేదు.
 
Hanōku dēvunitō kalasi naḍicāḍu. Dēvuḍu ataṇṇi tīsukuveḷḷāḍu ganuka ataḍu kanabaḍalēdu.

From Methuselah to Noah

25 మెతూషెలకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయస్సులో లెమెకు పుట్టాడు.
 
Metūṣelaku nūṭa enabhai ēḍu sanvatsarāla vayas'sulō lemeku puṭṭāḍu.
26 మెతూషెలకు లెమెకు పుట్టిన తరువాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
 
Metūṣelaku lemeku puṭṭina taruvāta ēḍu vandala enabhai reṇḍu sanvatsarālu bratiki koḍukulanu, kūtuḷḷanu kannāḍu.
27 మెతూషెల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు.
 
Metūṣela tom'midi vandala aravai tom'midi sanvatsarālu bratikāḍu.
28 లెమెకుకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయస్సులో ఒక కొడుకు పుట్టాడు.
 
Lemekuku nūṭa enabhai reṇḍu sanvatsarāla vayas'sulō oka koḍuku puṭṭāḍu.
29 “భూమిని యెహోవా శపించినందువల్ల కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడు మనకు విశ్రాంతి ఇస్తాడు” అని, అతనికి నోవహు అని పేరు పెట్టాడు.
 
“Bhūmini yehōvā śapin̄cinanduvalla kaligina mana cētula kaṣṭaṁ viṣayanlō, mana pani viṣayanlō itaḍu manaku viśrānti istāḍu” ani, ataniki nōvahu ani pēru peṭṭāḍu.
30 లెమెకుకు నోవహు పుట్టిన తరువాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికి కొడుకులను, కూతుళ్ళను కన్నాడు.
 
Lemekuku nōvahu puṭṭina taruvāta aidu vandala tombhai aidu sanvatsarālu bratiki koḍukulanu, kūtuḷḷanu kannāḍu.
31 లెమెకు ఏడువందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు.
 
Lemeku ēḍuvandala ḍebbhai ēḍu sanvatsarālu bratikāḍu.
32 ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవహుకు షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు.
 
Aidu vandala sanvatsarālu bratikina nōvahuku ṣēmu, hāmu, yāpetu anē mugguru koḍukulu puṭṭāru.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.