PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.3.1

దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు.
 
Dēvuḍaina yehōvā cēsina jantuvulanniṭilō pāmu jittulamāri. Vāḍu ā strītō “nijamēnā? ‘Ī tōṭalō unna ceṭlaku kāsē ē paṇḍu ēdī mīru tinakūḍadu’ ani dēvuḍu ceppāḍā?” Annāḍu.

ఆది 3
ఆది 3:1-7

The Serpent’s Deception

1 దేవుడైన యెహోవా చేసిన జంతువులన్నిటిలో పాము జిత్తులమారి. వాడు ఆ స్త్రీతో “నిజమేనా? ‘ఈ తోటలో ఉన్న చెట్లకు కాసే ఏ పండు ఏదీ మీరు తినకూడదు’ అని దేవుడు చెప్పాడా?” అన్నాడు.
 
Dēvuḍaina yehōvā cēsina jantuvulanniṭilō pāmu jittulamāri. Vāḍu ā strītō “nijamēnā? ‘Ī tōṭalō unna ceṭlaku kāsē ē paṇḍu ēdī mīru tinakūḍadu’ ani dēvuḍu ceppāḍā?” Annāḍu.
2 స్త్రీ ఆ సర్పంతో “ఈ తోటలో ఉన్న చెట్ల పండ్లు మేము తినవచ్చు.
 
Strī ā sarpantō “ī tōṭalō unna ceṭla paṇḍlu mēmu tinavaccu.
3 కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు పండ్ల విషయంలో ‘మీరు వాటిని తినకూడదు. వాటిని ముట్టుకోకూడదు. అలా చేస్తే మీరు చనిపోతారు’ అని దేవుడు చెప్పాడు” అంది.
 
Kānī tōṭa madhyalō unna ceṭṭu paṇḍla viṣayanlō ‘mīru vāṭini tinakūḍadu. Vāṭini muṭṭukōkūḍadu. Alā cēstē mīru canipōtāru’ ani dēvuḍu ceppāḍu” andi.
4 పాము స్త్రీతో “మీరు చావనే చావరు.
 
Pāmu strītō “mīru cāvanē cāvaru.
5 ఎందుకంటే, మీరు దాన్ని తిన్న రోజున మీ కళ్ళు తెరుచుకుంటాయి. మీరు మంచి చెడ్డలు తెలిసి, దేవుళ్ళ వలె ఉంటారని దేవుడికి తెలుసు” అన్నాడు.
 
Endukaṇṭē, mīru dānni tinna rōjuna mī kaḷḷu terucukuṇṭāyi. Mīru man̄ci ceḍḍalu telisi, dēvuḷḷa vale uṇṭārani dēvuḍiki telusu” annāḍu.
6 స్త్రీ, ఆ చెట్టు తినడానికి మంచిదిగా, కంటికి ఇంపుగా, వివేకం కలగడం కోసం కోరదగినదిగా ఉండడం చూసి, దాని పండ్లలో కొన్నిటిని కోసి తిని, తనతోపాటు తన భర్తకు కూడా ఇచ్చింది. అతడు కూడా తిన్నాడు.
 
Strī, ā ceṭṭu tinaḍāniki man̄cidigā, kaṇṭiki impugā, vivēkaṁ kalagaḍaṁ kōsaṁ kōradaginadigā uṇḍaḍaṁ cūsi, dāni paṇḍlalō konniṭini kōsi tini, tanatōpāṭu tana bhartaku kūḍā iccindi. Ataḍu kūḍā tinnāḍu.
7 అప్పుడు వాళ్ళిద్దరికీ కళ్ళు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నాం అని గ్రహించి అంజూరపు ఆకులు కలిపి కుట్టి ఒళ్ళు కప్పుకునేవి తయారు చేసుకున్నారు.
 
Appuḍu vāḷḷiddarikī kaḷḷu terucukunnāyi. Tāmu nagnaṅgā unnāṁ ani grahin̄ci an̄jūrapu ākulu kalipi kuṭṭi oḷḷu kappukunēvi tayāru cēsukunnāru.

God Arraigns Adam and Eve

8 సాయంత్రం చల్లబడిన తరువాత ఆ తోటలో దేవుడైన యెహోవా నడుస్తున్న శబ్ధం వాళ్ళు విన్నారు. ఆదాము, అతని భార్య దేవుడైన యెహోవాకు ఎదురు పడకుండా తోటలో చెట్ల మధ్య దాక్కున్నారు.
 
Sāyantraṁ callabaḍina taruvāta ā tōṭalō dēvuḍaina yehōvā naḍustunna śabdhaṁ vāḷḷu vinnāru. Ādāmu, atani bhārya dēvuḍaina yehōvāku eduru paḍakuṇḍā tōṭalō ceṭla madhya dākkunnāru.
9 దేవుడైన యెహోవా ఆదామును పిలుస్తూ “నువ్వెక్కడ ఉన్నావు?” అన్నాడు.
 
Dēvuḍaina yehōvā ādāmunu pilustū “nuvvekkaḍa unnāvu?” Annāḍu.
10 అతడు “నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు నగ్నంగా ఉన్నాను గనక భయపడి దాక్కున్నాను” అన్నాడు.
 
Ataḍu “nēnu tōṭalō nī svaraṁ vinnappuḍu nagnaṅgā unnānu ganaka bhayapaḍi dākkunnānu” annāḍu.
11 దేవుడు “నువ్వు నగ్నంగా ఉన్నావని నీకెవరు చెప్పారు? తినొద్దని నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావా?” అన్నాడు.
 
Dēvuḍu “nuvvu nagnaṅgā unnāvani nīkevaru ceppāru? Tinoddani nīku ājña iccina ā ceṭṭu paṇḍu tinnāvā?” Annāḍu.
12 ఆదాము “నాతో ఉండడానికి నువ్వు నాకిచ్చిన స్త్రీ నాకు ఆ చెట్టు పండు ఇచ్చింది. అప్పుడు నేను దాన్ని తిన్నాను” అన్నాడు.
 
Ādāmu “nātō uṇḍaḍāniki nuvvu nākiccina strī nāku ā ceṭṭu paṇḍu iccindi. Appuḍu nēnu dānni tinnānu” annāḍu.
13 దేవుడైన యెహోవా స్త్రీతో “నువ్వు చేసిందేమిటి?” అన్నాడు. స్త్రీ “సర్పం నన్ను మోసం చేసిన కారణంగా నేను తిన్నాను” అంది.
 
Dēvuḍaina yehōvā strītō “nuvvu cēsindēmiṭi?” Annāḍu. Strī “sarpaṁ nannu mōsaṁ cēsina kāraṇaṅgā nēnu tinnānu” andi.

The Fate of the Serpent

14 అందుకు దేవుడైన యెహోవా పాముతో “నువ్వు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో, జంతువులన్నిటిలో నిన్ను మాత్రమే శపిస్తున్నాను. నువ్వు నీ కడుపుతో పాకుతూ వెళ్తావు. బ్రతికినంత కాలం మట్టి తింటావు.
 
Anduku dēvuḍaina yehōvā pāmutō “nuvvu ilā cēsinanduku paśuvulanniṭilō, jantuvulanniṭilō ninnu mātramē śapistunnānu. Nuvvu nī kaḍuputō pākutū veḷtāvu. Bratikinanta kālaṁ maṭṭi tiṇṭāvu.
15 నీకూ స్త్రీకీ నీ సంతానానికీ ఆమె సంతానానికీ మధ్య శత్రుత్వం ఉండేలా చేస్తాను. అతడు నిన్ను తలమీద కొడతాడు. నువ్వు అతన్ని మడిమె మీద కొడతావు” అన్నాడు.
 
Nīkū strīkī nī santānānikī āme santānānikī madhya śatrutvaṁ uṇḍēlā cēstānu. Ataḍu ninnu talamīda koḍatāḍu. Nuvvu atanni maḍime mīda koḍatāvu” annāḍu.

The Punishment of Mankind

16 ఆయన స్త్రీతో “పిల్లలను కనేటప్పుడు నీకు కలిగే బాధ అనేక రెట్లు పెంచుతున్నాను. నీ భర్తపై నువ్వు వాంఛ కలిగి ఉంటావు. అతడు నిన్ను ఏలుతాడు” అని చెప్పాడు.
 
Āyana strītō “pillalanu kanēṭappuḍu nīku kaligē bādha anēka reṭlu pen̄cutunnānu. Nī bhartapai nuvvu vān̄cha kaligi uṇṭāvu. Ataḍu ninnu ēlutāḍu” ani ceppāḍu.
17 ఆయన ఆదాముతో “నువ్వు నీ భార్య మాట విని ‘తినొద్దు’ అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ చెట్టు పండు తిన్నావు గనుక నిన్నుబట్టి నేల శాపానికి గురయ్యింది. జీవితకాలమంతా కష్టం చేసి నువ్వు దాని పంట తింటావు.
 
Āyana ādāmutō “nuvvu nī bhārya māṭa vini ‘tinoddu’ ani nēnu nīku ājña iccina ā ceṭṭu paṇḍu tinnāvu ganuka ninnubaṭṭi nēla śāpāniki gurayyindi. Jīvitakālamantā kaṣṭaṁ cēsi nuvvu dāni paṇṭa tiṇṭāvu.
18 నువ్వు ఎంత కష్టం చేసినా నేల ముళ్ళ తుప్పలను, ముళ్ళ పొదలనే మొలిపిస్తుంది. నువ్వు పొలంలో పండించిన పంట తింటావు.
 
Nuvvu enta kaṣṭaṁ cēsinā nēla muḷḷa tuppalanu, muḷḷa podalanē molipistundi. Nuvvu polanlō paṇḍin̄cina paṇṭa tiṇṭāvu.
19 నువ్వు మట్టికి తిరిగి చేరే వరకూ చెమటోడ్చి ఆహారం తింటావు. ఎందుకంటే నిన్ను తీసింది మట్టిలోనుంచే. నువ్వు మట్టే గనుక మళ్ళీ మట్టి అయిపోతావు” అని చెప్పాడు.
 
Nuvvu maṭṭiki tirigi cērē varakū cemaṭōḍci āhāraṁ tiṇṭāvu. Endukaṇṭē ninnu tīsindi maṭṭilōnun̄cē. Nuvvu maṭṭē ganuka maḷḷī maṭṭi ayipōtāvu” ani ceppāḍu.
20 ఆదాము తన భార్యకు హవ్వ#3:20 హవ్వ అంటే జీవం అని పేరు పెట్టాడు. ఎందుకంటే జీవులందరికీ ఆమే అమ్మ.
 
Ādāmu tana bhāryaku havva ani pēru peṭṭāḍu. Endukaṇṭē jīvulandarikī āmē am'ma.

The Expulsion from Paradise

21 దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు.
 
Dēvuḍaina yehōvā ādāmuku atani bhāryaku jantu carmantō baṭṭalu cēsi toḍigin̄cāḍu.
22 దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు.
 
Dēvuḍaina yehōvā “ippuḍu maniṣi man̄ci ceḍḍalu telisina manalāṇṭivāḍayyāḍu. Kābaṭṭi okavēḷa ataḍu tana ceyyi cāpi ā jīva vr̥kṣaphalaṁ kūḍā tīsukuni tini śāśvataṅgā jīvistāḍēmō. Adi man̄cidi kādu” annāḍu.
23 దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీశాడో ఆ నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు.
 
Dēvuḍaina yehōvā ataṇṇi ē nēlanun̄ci tīśāḍō ā nēlanu sāgu ceyyaḍāniki ēdenu tōṭalōnun̄ci ataṇṇi pampivēśāḍu.
24 కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.
 
Kābaṭṭi dēvuḍu ēdenu tōṭalōnun̄ci ādāmunu veḷḷagoṭṭi, ēdenu tōṭaku tūrpu vaipu kerūbulu, jīvavr̥kṣāniki veḷḷē dārini kāpalā kāyaḍāniki iṭu aṭu tirigē agnikhaḍgaṁ nilabeṭṭāḍu.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.