PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.14.1

షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో
 
Ṣīnāru rāju amrāpēlu, ellāsaru rāju aryōku, ēlāmu rāju kadorlāyōmeru, gōyīyula rāju tidālu anēvāru pālistunna rōjullō

ఆది 14
ఆది 14:1-9

The War of the Kings

1 షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు అనేవారు పాలిస్తున్న రోజుల్లో
 
Ṣīnāru rāju amrāpēlu, ellāsaru rāju aryōku, ēlāmu rāju kadorlāyōmeru, gōyīyula rāju tidālu anēvāru pālistunna rōjullō
2 ఆ రాజులు సొదొమ రాజు బెరాతో, గొమొర్రా రాజు బిర్షాతో, అద్మా రాజు షినాబుతో, సెబోయీయుల రాజు షెమేబెరుతో, బెల (దీన్ని సోయరు అని కూడా పిలుస్తారు) రాజుతో యుద్ధం చేశారు.
 
Ā rājulu sodoma rāju berātō, gomorrā rāju birṣātō, admā rāju ṣinābutō, sebōyīyula rāju ṣemēberutō, bela (dīnni sōyaru ani kūḍā pilustāru) rājutō yud'dhaṁ cēśāru.
3 వీళ్ళందరూ కలిసి సిద్దీము (ఉప్పు సముద్రం) లోయలో ఏకంగా సమకూడారు.
 
Vīḷḷandarū kalisi siddīmu (uppu samudraṁ) lōyalō ēkaṅgā samakūḍāru.
4 ఈ రాజులు పన్నెండు సంవత్సరాలు కదొర్లాయోమెరుకు లొంగి ఉన్నారు. పదమూడో సంవత్సరంలో తిరుగుబాటు చేశారు.
 
Ī rājulu panneṇḍu sanvatsarālu kadorlāyōmeruku loṅgi unnāru. Padamūḍō sanvatsaranlō tirugubāṭu cēśāru.
5 పద్నాలుగో సంవత్సరంలో కదొర్లాయోమెరు, అతనితోపాటు ఉన్న రాజులు వచ్చి అష్తారోత్‌ కర్నాయిములో రెఫాయీయులపై, హాములో జూజీయులపై, షావే కిర్యతాయిము మైదానంలో ఏమీయులపై,
 
Padnālugō sanvatsaranlō kadorlāyōmeru, atanitōpāṭu unna rājulu vacci aṣtārōt karnāyimulō rephāyīyulapai, hāmulō jūjīyulapai, ṣāvē kiryatāyimu maidānanlō ēmīyulapai,
6 శేయీరు పర్వత ప్రదేశంలో అరణ్యం వైపుగా ఉన్న ఏల్ పారాను వరకూ ఉన్న హోరీయులపై దాడి చేశారు.
 
Śēyīru parvata pradēśanlō araṇyaṁ vaipugā unna ēl pārānu varakū unna hōrīyulapai dāḍi cēśāru.
7 తరువాత మళ్ళీ ఏన్మిష్పతుకు (దీన్ని కాదేషు అనికూడా పిలుస్తారు) వచ్చి అమాలేకీయుల దేశమంతటినీ హససోను తామారులో కాపురం ఉన్న అమోరీయులను కూడా ఓడించారు.
 
Taruvāta maḷḷī ēnmiṣpatuku (dīnni kādēṣu anikūḍā pilustāru) vacci amālēkīyula dēśamantaṭinī hasasōnu tāmārulō kāpuraṁ unna amōrīyulanu kūḍā ōḍin̄cāru.
8 అప్పుడు సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము, బెల (సోయరు) రాజులు బయలుదేరి సిద్దీము లోయలో
 
Appuḍu sodoma, gomorrā, admā, sebōyīmu, bela (sōyaru) rājulu bayaludēri siddīmu lōyalō
9 ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు అనే నలుగురితో ఈ ఐదుగురు రాజులు యుద్ధం చేశారు.
 
Ēlāmu rāju kadorlāyōmeru, gōyīyula rāju tidālu, ṣīnāru rāju amrāpēlu, ellāsaru rāju aryōku anē naluguritō ī aiduguru rājulu yud'dhaṁ cēśāru.

Abram Rescues Lot

10 ఆ సిద్దీము లోయలో తారు బంక గుంటలు ఎక్కువగా ఉన్నాయి. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడ్డారు. మిగిలిన వాళ్ళు కొండలకు పారిపోయారు.
 
Ā siddīmu lōyalō tāru baṅka guṇṭalu ekkuvagā unnāyi. Sodoma gomorrāla rājulu pāripōyi vāṭilō paḍḍāru. Migilina vāḷḷu koṇḍalaku pāripōyāru.
11 అప్పుడు వాళ్ళు సొదొమ గొమొర్రాల ఆస్తి అంతటినీ వాళ్ళ భోజన పదార్ధాలన్నిటినీ దోచుకున్నారు.
 
Appuḍu vāḷḷu sodoma gomorrāla āsti antaṭinī vāḷḷa bhōjana padārdhālanniṭinī dōcukunnāru.
12 ఇంకా అబ్రాము సోదరుడి కొడుకు లోతు సొదొమలో కాపురం ఉన్నాడు గనుక అతణ్ణి, అతని ఆస్తిని కూడా దోచుకుని తీసుకుపోయారు.
 
Iṅkā abrāmu sōdaruḍi koḍuku lōtu sodomalō kāpuraṁ unnāḍu ganuka ataṇṇi, atani āstini kūḍā dōcukuni tīsukupōyāru.
13 ఒకడు తప్పించుకుని వచ్చి హెబ్రీయుడైన అబ్రాముకు ఆ సంగతి తెలియజేశాడు. ఆ సమయంలో అతడు ఎష్కోలు, ఆనేరుల సోదరుడు మమ్రే అనే అమోరీయునికి చెందిన సింధూర వృక్షాల దగ్గర కాపురం ఉన్నాడు. వీళ్ళు అబ్రాముతో పరస్పర సహాయం కోసం ఒప్పందం చేసుకున్నవాళ్ళు.
 
Okaḍu tappin̄cukuni vacci hebrīyuḍaina abrāmuku ā saṅgati teliyajēśāḍu. Ā samayanlō ataḍu eṣkōlu, ānērula sōdaruḍu mamrē anē amōrīyuniki cendina sindhūra vr̥kṣāla daggara kāpuraṁ unnāḍu. Vīḷḷu abrāmutō paraspara sahāyaṁ kōsaṁ oppandaṁ cēsukunnavāḷḷu.
14 తన బంధువు శత్రువుల స్వాధీనంలో ఉన్నాడని అబ్రాము విని, తన ఇంట్లో పుట్టి, సుశిక్షితులైన మూడువందల పద్దెనిమిది మందిని వెంటబెట్టుకుని వెళ్లి దాను వరకూ ఆ రాజులను తరిమాడు.
 
Tana bandhuvu śatruvula svādhīnanlō unnāḍani abrāmu vini, tana iṇṭlō puṭṭi, suśikṣitulaina mūḍuvandala paddenimidi mandini veṇṭabeṭṭukuni veḷli dānu varakū ā rājulanu tarimāḍu.
15 రాత్రి సమయంలో అతడు తన సేవకులను గుంపులుగా చేశాక వాళ్ళంతా అ రాజులపై దాడి చేసి, దమస్కుకు ఎడమవైపు ఉన్న హోబా వరకూ తరిమాడు.
 
Rātri samayanlō ataḍu tana sēvakulanu gumpulugā cēśāka vāḷḷantā a rājulapai dāḍi cēsi, damaskuku eḍamavaipu unna hōbā varakū tarimāḍu.
16 అతడు ఆస్తి మొత్తాన్ని, అతని బంధువు లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను వెనక్కి తీసుకు వచ్చాడు.
 
Ataḍu āsti mottānni, atani bandhuvu lōtunu, atani āstini, strīlanu, prajalanu venakki tīsuku vaccāḍu.

Melchizedek Blesses Abram

17 అతడు కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు, సొదొమ రాజు అతన్ని ఎదుర్కోడానికి రాజు లోయ అనే షావే లోయ వరకూ బయలుదేరి వచ్చాడు.
 
Ataḍu kadorlāyōmerunu, atanitō unna rājulanu ōḍin̄ci tirigi vastunnappuḍu, sodoma rāju atanni edurkōḍāniki rāju lōya anē ṣāvē lōya varakū bayaludēri vaccāḍu.
18 అంతేగాక #14:18 అంటే యెరూషలేముషాలేము రాజు మెల్కీసెదెకు రొట్టె, ద్రాక్షారసం తీసుకువచ్చాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు.
 
Antēgāka ṣālēmu rāju melkīsedeku roṭṭe, drākṣārasaṁ tīsukuvaccāḍu. Ataḍu sarvōnnatuḍaina dēvuniki yājakuḍu.
19 అతడు అబ్రామును ఆశీర్వదించి “ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాముకు ఆశీర్వాదం కలుగు గాక.
 
Ataḍu abrāmunu āśīrvadin̄ci “ākāśāniki bhūmiki sr̥ṣṭikarta, sarvōnnatuḍu ayina dēvuni valana abrāmuku āśīrvādaṁ kalugu gāka.
20 నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగు గాక” అని చెప్పాడు. అప్పుడు అబ్రాము అతనికి తనకున్న దానిలో పదవ వంతు ఇచ్చాడు.
 
Nī śatruvulanu nī cētiki appagin̄cina sarvōnnatuḍaina dēvuniki stuti kalugu gāka” ani ceppāḍu. Appuḍu abrāmu ataniki tanakunna dānilō padava vantu iccāḍu.
21 సొదొమ రాజు “మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నువ్వే తీసుకో” అని అబ్రాముతో అన్నాడు.
 
Sodoma rāju “manuṣulanu nāku icci āstini nuvvē tīsukō” ani abrāmutō annāḍu.
22 అబ్రాము “దేవుడైన యెహోవా అబ్రామును ధనవంతుణ్ణి చేశాను, అని నువ్వు చెప్పకుండా ఉండేలా, ఒక్క నూలు పోగైనా, చెప్పుల పట్టీ అయినా నీ వాటిలోనుండి తీసుకోను.
 
Abrāmu “dēvuḍaina yehōvā abrāmunu dhanavantuṇṇi cēśānu, ani nuvvu ceppakuṇḍā uṇḍēlā, okka nūlu pōgainā, ceppula paṭṭī ayinā nī vāṭilōnuṇḍi tīsukōnu.
23 ఆకాశానికి భూమికి సృష్టికర్త, సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా దగ్గర నా చెయ్యి ఎత్తి ఒట్టు పెట్టుకున్నాను.
 
Ākāśāniki bhūmiki sr̥ṣṭikarta, sarvōnnatuḍaina dēvuḍaina yehōvā daggara nā ceyyi etti oṭṭu peṭṭukunnānu.
24 ఈ యువకులు తిన్నది గాక, నాతోపాటు వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అనే వాళ్లకు ఏ వాటా రావాలో ఆ వాటాలు మాత్రం వాళ్ళను తీసుకోనివ్వు” అని సొదొమ రాజుతో చెప్పాడు.
 
Ī yuvakulu tinnadi gāka, nātōpāṭu vaccina ānēru, eṣkōlu, mamrē anē vāḷlaku ē vāṭā rāvālō ā vāṭālu mātraṁ vāḷḷanu tīsukōnivvu” ani sodoma rājutō ceppāḍu.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.