PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.12.1
IRVTel దేవుడు

యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల#12:1 లేక నీవు పుట్టిన స్థలం. దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు.
 
Yehōvā abrāmutō ilā ceppāḍu. “Nī dēśaṁ nun̄ci, nī bandhuvula daggara nun̄ci, nī taṇḍri iṇṭi nun̄ci bayaludēri, nēnu nīku cūpin̄cē pradēśāniki veḷḷu.

ఆది 12
ఆది 12:1-9

The Call of Abram

1 యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల#12:1 లేక నీవు పుట్టిన స్థలం. దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు.
 
Yehōvā abrāmutō ilā ceppāḍu. “Nī dēśaṁ nun̄ci, nī bandhuvula daggara nun̄ci, nī taṇḍri iṇṭi nun̄ci bayaludēri, nēnu nīku cūpin̄cē pradēśāniki veḷḷu.
2 నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.
 
Ninnu oka goppa jātigā cēsi, ninnu āśīrvadin̄ci, nī pērunu goppacēstānu. Nuvvu dīvenagā uṇṭāvu.
3 నిన్ను ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించేవాళ్ళను శపిస్తాను. భూమి మీద ఉన్న వంశాలన్నిటికీ నీ ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది.”
 
Ninnu āśīrvadin̄cē vāḷḷanu nēnu āśīrvadistānu. Ninnu dūṣin̄cēvāḷḷanu śapistānu. Bhūmi mīda unna vanśālanniṭikī nī dvārā āśīrvādaṁ kalugutundi.”
4 యెహోవా అతనికి చెప్పినట్టు అబ్రాము చేశాడు. అతనితోపాటు లోతు కూడా బయలుదేరాడు. హారాను నుంచి బయలుదేరినప్పుడు అబ్రాము వయసు డెబ్భై ఐదు సంవత్సరాలు.
 
Yehōvā ataniki ceppinaṭṭu abrāmu cēśāḍu. Atanitōpāṭu lōtu kūḍā bayaludērāḍu. Hārānu nun̄ci bayaludērinappuḍu abrāmu vayasu ḍebbhai aidu sanvatsarālu.
5 అబ్రాము తన భార్య శారయిని, తన సోదరుడి కొడుకు లోతును, హారానులో తాను, తనవాళ్ళు, సేకరించిన ఆస్తి అంతటినీ, వాళ్ళ సంపాదన మొత్తాన్నీ తీసుకుని కనాను అనే ప్రదేశానికి వచ్చాడు.
 
Abrāmu tana bhārya śārayini, tana sōdaruḍi koḍuku lōtunu, hārānulō tānu, tanavāḷḷu, sēkarin̄cina āsti antaṭinī, vāḷḷa sampādana mottānnī tīsukuni kanānu anē pradēśāniki vaccāḍu.
6 అబ్రాము ఆ ప్రదేశంలో షెకెములో ఉన్న ఒక ప్రాంతానికి వచ్చి మోరే ప్రాంతంలో సింధూర వృక్షం దగ్గరికి చేరుకున్నాడు. అప్పటికి ఆ ప్రదేశంలో కనానీయులు నివాసం ఉన్నారు.
 
Abrāmu ā pradēśanlō ṣekemulō unna oka prāntāniki vacci mōrē prāntanlō sindhūra vr̥kṣaṁ daggariki cērukunnāḍu. Appaṭiki ā pradēśanlō kanānīyulu nivāsaṁ unnāru.
7 యెహోవా అబ్రాముతో “నీ వారసులకు#12:7 లేక సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను” అని చెప్పాడు. అక్కడ అతడు యెహోవాకు హోమ బలి అర్పించాడు.
 
Yehōvā abrāmutō “nī vārasulaku ī dēśānni istānu” ani ceppāḍu. Akkaḍa ataḍu yehōvāku hōma bali arpin̄cāḍu.
8 అతడు అక్కడనుంచి బయలుదేరి బేతేలుకు తూర్పువైపు ఉన్న కొండ దగ్గరికి వచ్చాడు. పడమర వైపు ఉన్న బేతేలుకు, తూర్పున ఉన్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు హోమబలి అర్పించి, యెహోవా పేరట ప్రార్థన చేశాడు.
 
Ataḍu akkaḍanun̄ci bayaludēri bētēluku tūrpuvaipu unna koṇḍa daggariki vaccāḍu. Paḍamara vaipu unna bētēluku, tūrpuna unna hāyiki madhya guḍāraṁ vēsi akkaḍa yehōvāku hōmabali arpin̄ci, yehōvā pēraṭa prārthana cēśāḍu.
9 అబ్రాము ఇంకా ప్రయాణం చేస్తూ దక్షిణం వైపు వెళ్ళాడు.
 
Abrāmu iṅkā prayāṇaṁ cēstū dakṣiṇaṁ vaipu veḷḷāḍu.

Abram and Sarai in Egypt

10 అప్పుడు ఆ ప్రదేశంలో కరువు వచ్చింది. కరువు తీవ్రంగా ఉన్న కారణంగా అబ్రాము ఐగుప్తులో నివసించడానికి వెళ్ళాడు.
 
Appuḍu ā pradēśanlō karuvu vaccindi. Karuvu tīvraṅgā unna kāraṇaṅgā abrāmu aiguptulō nivasin̄caḍāniki veḷḷāḍu.
11 అతడు ఐగుప్తులో ప్రవేశించడానికి ముందు తన భార్య శారయితో “చూడు, నువ్వు చాలా అందగత్తెవని నాకు తెలుసు,
 
Ataḍu aiguptulō pravēśin̄caḍāniki mundu tana bhārya śārayitō “cūḍu, nuvvu cālā andagattevani nāku telusu,
12 ఐగుప్తీయులు నిన్ను చూసి, ‘ఈమె అతని భార్య’ అని నీ మూలంగా నన్ను చంపుతారు. కాని నిన్ను బ్రతకనిస్తారు.
 
Aiguptīyulu ninnu cūsi, ‘īme atani bhārya’ ani nī mūlaṅgā nannu camputāru. Kāni ninnu bratakanistāru.
13 నీ వల్ల నాకు మేలు కలిగేలా, నీ కారణంగా నేను చావకుండేలా నువ్వు నా సోదరివి అని దయచేసి చెప్పు” అన్నాడు.
 
Nī valla nāku mēlu kaligēlā, nī kāraṇaṅgā nēnu cāvakuṇḍēlā nuvvu nā sōdarivi ani dayacēsi ceppu” annāḍu.
14 అబ్రాము ఐగుప్తులో ప్రవేశించినప్పుడు ఐగుప్తీయులు శారయి చాలా అందంగా ఉండడం గమనించారు.
 
Abrāmu aiguptulō pravēśin̄cinappuḍu aiguptīyulu śārayi cālā andaṅgā uṇḍaḍaṁ gamanin̄cāru.
15 ఫరో అధిపతులు ఆమెను చూసి ఫరో దగ్గర ఆమె అందాన్ని పొగిడారు. ఆమెను ఫరో ఇంటికి తీసుకెళ్ళారు.
 
Pharō adhipatulu āmenu cūsi pharō daggara āme andānni pogiḍāru. Āmenu pharō iṇṭiki tīsukeḷḷāru.
16 ఆమె మూలంగా అతడు అబ్రామును చాలా బాగా చూసుకున్నాడు. అతనికి గొర్రెలు, ఎడ్లు, మగ గాడిదలు, సేవకులు, పనికత్తెలు, ఆడగాడిదలు, ఒంటెలు ఇచ్చాడు.
 
Āme mūlaṅgā ataḍu abrāmunu cālā bāgā cūsukunnāḍu. Ataniki gorrelu, eḍlu, maga gāḍidalu, sēvakulu, panikattelu, āḍagāḍidalu, oṇṭelu iccāḍu.
17 అప్పుడు యెహోవా అబ్రాము భార్య శారయిని బట్టి ఫరోను, అతని ఇంటివాళ్ళను తీవ్రమైన రోగాలతో బాధపరిచాడు.
 
Appuḍu yehōvā abrāmu bhārya śārayini baṭṭi pharōnu, atani iṇṭivāḷḷanu tīvramaina rōgālatō bādhaparicāḍu.
18 అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి “నువ్వు నాకు చేసిందేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు?
 
Appuḍu pharō abrāmunu pilipin̄ci “nuvvu nāku cēsindēmiṭi? Īme nī bhārya ani nākenduku ceppalēdu?
19 ఈమె నా సోదరి అని ఎందుకు చెప్పావు? ఒకవేళ నేను ఆమెను నా భార్యగా చేసుకుని ఉంటే ఏమి జరిగేది? ఇదిగో నీ భార్య. ఈమెను తీసుకువెళ్ళు” అని చెప్పాడు.
 
Īme nā sōdari ani enduku ceppāvu? Okavēḷa nēnu āmenu nā bhāryagā cēsukuni uṇṭē ēmi jarigēdi? Idigō nī bhārya. Īmenu tīsukuveḷḷu” ani ceppāḍu.
20 తరువాత ఫరో అతని గూర్చి ప్రజలకు ఆజ్ఞాపించాడు. వాళ్ళు అబ్రామును అతని భార్యతో అతని ఆస్తిపాస్తులన్నిటితో సహా పంపివేశారు.
 
Taruvāta pharō atani gūrci prajalaku ājñāpin̄cāḍu. Vāḷḷu abrāmunu atani bhāryatō atani āstipāstulanniṭitō sahā pampivēśāru.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.