PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.11.1

అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
 
Appuḍu bhūmipai andarū okē bhāṣa māṭlāḍēvāru.

ఆది 11
ఆది 11:1-9

The Tower of Babel

1 అప్పుడు భూమిపై అందరూ ఒకే భాష మాట్లాడేవారు.
 
Appuḍu bhūmipai andarū okē bhāṣa māṭlāḍēvāru.
2 వాళ్ళు తూర్పుకు ప్రయాణం చేస్తున్నప్పుడు షీనారు#11:2 షీనారు అని రాసిన చోటల్లా బబులోను అని అర్థం ప్రాంతంలో వాళ్లకు ఒక మైదానం కనబడింది. వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు.
 
Vāḷḷu tūrpuku prayāṇaṁ cēstunnappuḍu ṣīnāru prāntanlō vāḷlaku oka maidānaṁ kanabaḍindi. Vāḷḷu akkaḍa sthirapaḍḍāru.
3 వాళ్ళు ఒకరితో ఒకరు “మనం ఇటుకలు తయారు చేసి, చక్కగా కాల్చుదాం రండి” అని మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులు ఇటుకలు, అతకడానికి తారు కీలు వాళ్లకు అందుబాటులో ఉన్నాయి.
 
Vāḷḷu okaritō okaru “manaṁ iṭukalu tayāru cēsi, cakkagā kālcudāṁ raṇḍi” ani māṭlāḍukunnāru. Rāḷḷaku badulu iṭukalu, atakaḍāniki tāru kīlu vāḷlaku andubāṭulō unnāyi.
4 వాళ్ళు “మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఉండేలా ఒక పట్టణాన్ని, ఆకాశాన్ని అంటే శిఖరం ఉన్న ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి” అని మాట్లాడుకున్నారు.
 
Vāḷḷu “manaṁ bhūmi antaṭā cediripōkuṇḍā uṇḍēlā oka paṭṭaṇānni, ākāśānni aṇṭē śikharaṁ unna oka gōpuraṁ kaṭṭukuni pēru sampādin̄cukundāṁ raṇḍi” ani māṭlāḍukunnāru.
5 యెహోవా ఆదాము సంతానం కట్టిన పట్టణాన్ని, గోపురాన్ని, చూడడానికి దిగి వచ్చాడు.
 
Yehōvā ādāmu santānaṁ kaṭṭina paṭṭaṇānni, gōpurānni, cūḍaḍāniki digi vaccāḍu.
6 యెహోవా “ఇదిగో, ఒకే భాష ఉన్న ఈ మనుషులు పని చేయడం ప్రారంభించారు! ఇకముందు వాళ్ళు చెయ్యాలనుకున్న ఏ పనైనా వాళ్లకు అసాధ్యం కాదు.
 
Yehōvā “idigō, okē bhāṣa unna ī manuṣulu pani cēyaḍaṁ prārambhin̄cāru! Ikamundu vāḷḷu ceyyālanukunna ē panainā vāḷlaku asādhyaṁ kādu.
7 కాబట్టి మనం కిందికి వెళ్లి, వాళ్ళల్లో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేద్దాం రండి” అనుకున్నాడు.
 
Kābaṭṭi manaṁ kindiki veḷli, vāḷḷallō okari māṭa okariki teliyakuṇḍā akkaḍa vāḷḷa bhāṣanu tārumāru cēddāṁ raṇḍi” anukunnāḍu.
8 ఆ విధంగా యెహోవా వారు అక్కడ నుంచి భూమి అంతటా చెదిరిపోయేలా చేశాడు. ఆ పట్టణ నిర్మాణం ఆగిపోయింది.
 
Ā vidhaṅgā yehōvā vāru akkaḍa nun̄ci bhūmi antaṭā cediripōyēlā cēśāḍu. Ā paṭṭaṇa nirmāṇaṁ āgipōyindi.
9 అందువల్ల దానికి బాబెలు అనే పేరు పెట్టారు. ఎందుకంటే, అక్కడ యెహోవా భూమి మీద ఉన్న ప్రజలందరి భాషను తారుమారు చేశాడు. అక్కడ నుంచి యెహోవా వాళ్ళను భూమి మీద అనేక ప్రదేశాలకు చెదరగొట్టాడు.
 
Anduvalla dāniki bābelu anē pēru peṭṭāru. Endukaṇṭē, akkaḍa yehōvā bhūmi mīda unna prajalandari bhāṣanu tārumāru cēśāḍu. Akkaḍa nun̄ci yehōvā vāḷḷanu bhūmi mīda anēka pradēśālaku cedaragoṭṭāḍu.

Genealogy from Shem to Abram

10 షేము వంశావళి ఇది. షేముకు వంద సంవత్సరాల వయస్సులో, జలప్రళయం తరువాత రెండు సంవత్సరాలకు అర్పక్షదు పుట్టాడు.
 
Ṣēmu vanśāvaḷi idi. Ṣēmuku vanda sanvatsarāla vayas'sulō, jalapraḷayaṁ taruvāta reṇḍu sanvatsarālaku arpakṣadu puṭṭāḍu.
11 షేముకు అర్పక్షదు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికాడు.
 
Ṣēmuku arpakṣadu puṭṭina taruvāta iṅkā ataniki koḍukulu, kūtuḷḷu puṭṭāru. Ataḍu aidu vandala sanvatsarālu bratikāḍu.
12 అర్పక్షదుకు ముప్ఫై ఐదు సంవత్సరాల వయస్సులో షేలహు పుట్టాడు.
 
Arpakṣaduku mupphai aidu sanvatsarāla vayas'sulō ṣēlahu puṭṭāḍu.
13 అర్పక్షదుకు షేలహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
 
Arpakṣaduku ṣēlahu puṭṭina taruvāta iṅkā ataniki koḍukulu, kūtuḷḷu puṭṭāru. Ataḍu nālugu vandala mūḍu sanvatsarālu batikāḍu.
14 షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు.
 
Ṣēlahuku mupphai sanvatsarāla vayas'sulō ēberu puṭṭāḍu.
15 షేలహుకు ఏబెరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల మూడు సంవత్సరాలు బతికాడు.
 
Ṣēlahuku ēberu puṭṭina taruvāta iṅkā ataniki koḍukulu, kūtuḷḷu puṭṭāru. Ataḍu nālugu vandala mūḍu sanvatsarālu batikāḍu.
16 ఏబెరుకు ముప్ఫై నాలుగు సంవత్సరాల వయస్సులో పెలెగు పుట్టాడు.
 
Ēberuku mupphai nālugu sanvatsarāla vayas'sulō pelegu puṭṭāḍu.
17 ఏబెరుకు పెలెగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నాలుగు వందల ముప్ఫైసంవత్సరాలు బతికాడు.
 
Ēberuku pelegu puṭṭina taruvāta iṅkā ataniki koḍukulu, kūtuḷḷu puṭṭāru. Ataḍu nālugu vandala mupphaisanvatsarālu batikāḍu.
18 పెలెగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో రయూ పుట్టాడు.
 
Peleguku mupphai sanvatsarāla vayas'sulō rayū puṭṭāḍu.
19 పెలెగుకు రయూ పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండువందల తొమ్మిది సంవత్సరాలు బతికాడు.
 
Peleguku rayū puṭṭina taruvāta iṅkā ataniki koḍukulu, kūtuḷḷu puṭṭāru. Ataḍu reṇḍuvandala tom'midi sanvatsarālu batikāḍu.
20 రయూకు ముప్ఫై రెండు సంవత్సరాల వయస్సులో సెరూగు పుట్టాడు.
 
Rayūku mupphai reṇḍu sanvatsarāla vayas'sulō serūgu puṭṭāḍu.
21 రయూకు సెరూగు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు రెండు వందల ఏడు సంవత్సరాలు బతికాడు.
 
Rayūku serūgu puṭṭina taruvāta iṅkā ataniki koḍukulu, kūtuḷḷu puṭṭāru. Ataḍu reṇḍu vandala ēḍu sanvatsarālu batikāḍu.
22 సెరూగుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో నాహోరు పుట్టాడు.
 
Serūguku mupphai sanvatsarāla vayas'sulō nāhōru puṭṭāḍu.
23 సెరూగుకు నాహోరు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు, అతడు రెండువందల సంవత్సరాలు బతికాడు.
 
Serūguku nāhōru puṭṭina taruvāta iṅkā ataniki koḍukulu, kūtuḷḷu puṭṭāru, ataḍu reṇḍuvandala sanvatsarālu batikāḍu.
24 నాహోరుకు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో తెరహు పుట్టాడు.
 
Nāhōruku iravai tom'midi sanvatsarāla vayas'sulō terahu puṭṭāḍu.
25 నాహోరుకు తెరహు పుట్టిన తరువాత ఇంకా అతనికి కొడుకులు, కూతుళ్ళు పుట్టారు. అతడు నూట పంతొమ్మిది సంవత్సరాలు బతికాడు.
 
Nāhōruku terahu puṭṭina taruvāta iṅkā ataniki koḍukulu, kūtuḷḷu puṭṭāru. Ataḍu nūṭa pantom'midi sanvatsarālu batikāḍu.
26 తెరహుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు.
 
Terahuku ḍebbhai sanvatsarāla vayas'sulō abrāmu, nāhōru, hārānulu puṭṭāru.

Terah’s Descendants

27 తెరహు వంశావళి ఇది: తెరహుకు అబ్రాము, నాహోరు, హారానులు పుట్టారు. హారానుకు లోతు పుట్టాడు.
 
Terahu vanśāvaḷi idi: Terahuku abrāmu, nāhōru, hārānulu puṭṭāru. Hārānuku lōtu puṭṭāḍu.
28 హారాను, తాను పుట్టిన ప్రదేశంలో ఊరు అనే కల్దీయుల పట్టణంలో తన తండ్రి తెరహు కంటే ముందే చనిపోయాడు.
 
Hārānu, tānu puṭṭina pradēśanlō ūru anē kaldīyula paṭṭaṇanlō tana taṇḍri terahu kaṇṭē mundē canipōyāḍu.
29 అబ్రాము, నాహోరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అబ్రాము భార్య శారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కా, ఇస్కాలకు తండ్రి అయిన హారాను కూతురు.
 
Abrāmu, nāhōru peḷḷiḷḷu cēsukunnāru. Abrāmu bhārya śārayi. Nāhōru bhārya pēru milkā. Āme milkā, iskālaku taṇḍri ayina hārānu kūturu.
30 శారయి గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
 
Śārayi goḍrālu. Āmeku pillalu lēru.
31 తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.
 
Terahu tana koḍuku abrāmunu, tana manumaḍu, hārānu koḍuku lōtunu, tana kōḍalu śārayini tīsuku kanānuku bayaludērāḍu. Ūru anē kaldīyula paṭṭaṇanlō nun̄ci vāḷḷatōpāṭu bayaludēri hārānu varakū vacci akkaḍa nivāsaṁ unnāḍu.
32 తెరహు రెండు వందల ఐదు సంవత్సరాలు బతికి, హారానులో చనిపోయాడు.
 
Terahu reṇḍu vandala aidu sanvatsarālu batiki, hārānulō canipōyāḍu.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.