PepLamb's Audio Bible
Loading God's Word...
నా గొర్రె పిల్లలను మేపు | యోహాను 21:15-17
Gen.10.1

నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.
 
Nōvahu koḍukulu ṣēmu, hāmu, yāpetula vanśāvaḷi idi. Jalapraḷayaṁ taruvāta vāḷlaku koḍukulu puṭṭāru.

ఆది 10
ఆది 10:1-32

The Table of Nations

1 నోవహు కొడుకులు షేము, హాము, యాపెతుల వంశావళి ఇది. జలప్రళయం తరువాత వాళ్లకు కొడుకులు పుట్టారు.
 
Nōvahu koḍukulu ṣēmu, hāmu, yāpetula vanśāvaḷi idi. Jalapraḷayaṁ taruvāta vāḷlaku koḍukulu puṭṭāru.
The Japhethites
2 యాపెతు సంతానం గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.
 
Yāpetu santānaṁ gōmeru, māgōgu, mādayi, yāvānu, tubālu, meṣeku, tīrasu.
3 గోమెరు కొడుకులు అష్కనజు, రీఫతు, తోగర్మా.
 
Gōmeru koḍukulu aṣkanaju, rīphatu, tōgarmā.
4 యావాను సంతానం ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము.
 
Yāvānu santānaṁ ēlīṣā, tarṣīṣu, kittīmu, dādōnīmu.
5 వీళ్ళనుంచి సముద్రం వెంబడి మనుషులు వేరుపడి తమ ప్రాంతాలకు వెళ్ళారు. తమ తమ జాతుల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ వంశాల ప్రకారం, ఆ దేశాల్లో ఉన్నవాళ్ళు వేరైపోయారు.
 
Vīḷḷanun̄ci samudraṁ vembaḍi manuṣulu vērupaḍi tama prāntālaku veḷḷāru. Tama tama jātula prakāraṁ, tama tama bhāṣala prakāraṁ, tama tama vanśāla prakāraṁ, ā dēśāllō unnavāḷḷu vēraipōyāru.
The Hamites
6 హాము సంతానం కూషు, మిస్రాయిము, పూతు, కనాను.
 
Hāmu santānaṁ kūṣu, misrāyimu, pūtu, kanānu.
7 కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.
 
Kūṣu koḍukulu sebā, havīlā, sabtā, rāyamā, sabtakā. Rāyamā koḍukulu ṣēba, dadānu.
8 కూషుకు నిమ్రోదు పుట్టాడు. అతడు భూమి మీద పరాక్రమం కలిగిన శూరుల్లో మొదటివాడు.
 
Kūṣuku nimrōdu puṭṭāḍu. Ataḍu bhūmi mīda parākramaṁ kaligina śūrullō modaṭivāḍu.
9 అతడు యెహోవా దృష్టిలో పరాక్రమం గల వేటగాడు. కాబట్టి “యెహోవా దృష్టిలో పరాక్రమం కలిగిన వేటగాడైన నిమ్రోదు వలే” అనే నానుడి ఉంది.
 
Ataḍu yehōvā dr̥ṣṭilō parākramaṁ gala vēṭagāḍu. Kābaṭṭi “yehōvā dr̥ṣṭilō parākramaṁ kaligina vēṭagāḍaina nimrōdu valē” anē nānuḍi undi.
10 షీనారు ప్రాంతంలో ఉన్న బాబెలు#10:10 బబులోను, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణాలు అతని రాజ్యంలో ముఖ్య పట్టాణాలు.
 
Ṣīnāru prāntanlō unna bābelu, ereku, akkadu, kalnē anē paṭṭaṇālu atani rājyanlō mukhya paṭṭāṇālu.
11 ఆ ప్రాంతంలో నుంచి అతడు అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనెవె, రహోబోతీరు, కాలహు పట్టణాలను,
 
Ā prāntanlō nun̄ci ataḍu aṣṣūruku bayaludēri veḷḷi nīneve, rahōbōtīru, kālahu paṭṭaṇālanu,
12 నీనెవె కాలహుల మధ్య రెసెను అనే ఒక పెద్ద పట్టాణాన్నీ కట్టించాడు.
 
Nīneve kālahula madhya resenu anē oka pedda paṭṭāṇānnī kaṭṭin̄cāḍu.
13 మిస్రాయిముకు లూదీ, అనామీ, లెహాబీ, నప్తుహీ,
 
Misrāyimuku lūdī, anāmī, lehābī, naptuhī,
14 పత్రుసీ, కస్లూహీ, కఫ్తోరీలు పుట్టారు. ఫిలిష్తీయులు కస్లూహీయుల సంతతి.
 
Patrusī, kaslūhī, kaphtōrīlu puṭṭāru. Philiṣtīyulu kaslūhīyula santati.
15 కనాను మొదటి కొడుకు సీదోనుకు హేతు, యెబూసీ, అమోరీయ, గిర్గాషీ,
 
Kanānu modaṭi koḍuku sīdōnuku hētu, yebūsī, amōrīya, girgāṣī,
16 హివ్వీ, అర్కీయు, సినీయ,
 
Hivvī, arkīyu, sinīya,
17 అర్వాదీయ, సెమారీయ, హమాతీలు పుట్టారు.
 
Arvādīya, semārīya, hamātīlu puṭṭāru.
18 ఆ తరువాత కనానీయుల వంశాలు వ్యాప్తి చెందాయి.
 
Ā taruvāta kanānīyula vanśālu vyāpti cendāyi.
19 కనానీయుల సరిహద్దు సీదోను నుంచి గెరారుకు వెళ్ళే దారిలో గాజా వరకూ, సొదొమ గొమొర్రా, అద్మా సెబోయిములకు వెళ్ళే దారిలో లాషా వరకూ ఉంది.
 
Kanānīyula sarihaddu sīdōnu nun̄ci gerāruku veḷḷē dārilō gājā varakū, sodoma gomorrā, admā sebōyimulaku veḷḷē dārilō lāṣā varakū undi.
20 వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ జాతులను బట్టి హాము సంతానం.
 
Vīḷḷu, tama tama vanśāla prakāraṁ, tama tama bhāṣala prakāraṁ, tama tama jātulanu baṭṭi hāmu santānaṁ.
The Semites
21 యాపెతు అన్న షేముకు కూడా సంతానం కలిగింది. ఏబెరు వంశానికి మూలపురుషుడు షేము.
 
Yāpetu anna ṣēmuku kūḍā santānaṁ kaligindi. Ēberu vanśāniki mūlapuruṣuḍu ṣēmu.
22 షేము కొడుకులు ఏలాము, అష్షూరు, అర్పక్షదు, లూదు, అరాము.
 
Ṣēmu koḍukulu ēlāmu, aṣṣūru, arpakṣadu, lūdu, arāmu.
23 అరాము కొడుకులు ఊజు, హూలు, గెతెరు, మాష.
 
Arāmu koḍukulu ūju, hūlu, geteru, māṣa.
24 అర్పక్షదుకు షేలహు పుట్టాడు. షేలహుకు ఏబెరు పుట్టాడు.
 
Arpakṣaduku ṣēlahu puṭṭāḍu. Ṣēlahuku ēberu puṭṭāḍu.
25 ఏబెరుకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళల్లో ఒకడు పెలెగు. ఎందుకంటే అతని రోజుల్లో భూమి విభజన జరిగింది. రెండవవాడు యొక్తాను.
 
Ēberuku iddaru koḍukulu puṭṭāru. Vāḷḷallō okaḍu pelegu. Endukaṇṭē atani rōjullō bhūmi vibhajana jarigindi. Reṇḍavavāḍu yoktānu.
26 యొక్తానుకు అల్మోదాదు, షెలపు, హసర్మావెతు, యెరహు,
 
Yoktānuku almōdādu, ṣelapu, hasarmāvetu, yerahu,
27 హదోరము, ఊజాలు, దిక్లా,
 
Hadōramu, ūjālu, diklā,
28 ఓబాలు, అబీమాయెలు, షేబ,
 
Ōbālu, abīmāyelu, ṣēba,
29 ఓఫీరు, హవీలా, యోబాబులు పుట్టారు.
 
Ōphīru, havīlā, yōbābulu puṭṭāru.
30 వాళ్ళు నివాసం ఉండే స్థలాలు మేషా నుంచి సపారాకు వెళ్ళే దారిలో తూర్పు కొండలు.
 
Vāḷḷu nivāsaṁ uṇḍē sthalālu mēṣā nun̄ci sapārāku veḷḷē dārilō tūrpu koṇḍalu.
31 వీళ్ళు, తమ తమ వంశాల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ ప్రాంతాలను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కొడుకులు.
 
Vīḷḷu, tama tama vanśāla prakāraṁ, tama tama bhāṣala prakāraṁ, tama tama prāntālanu baṭṭi, tama tama jātulanu baṭṭi ṣēmu koḍukulu.
32 తమ తమ జనాల్లో తమ తమ సంతానాల ప్రకారం నోవహు కొడుకుల వంశాలు ఇవే. జలప్రళయం జరిగిన తరువాత వీళ్ళల్లోనుంచి జనాలు భూమి మీద వ్యాప్తి చెందారు.
 
Tama tama janāllō tama tama santānāla prakāraṁ nōvahu koḍukula vanśālu ivē. Jalapraḷayaṁ jarigina taruvāta vīḷḷallōnun̄ci janālu bhūmi mīda vyāpti cendāru.

క్రాస్ రిఫరెన్స్‌లు

ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు అందుబాటులో లేవు.